KGF2: యష్ కోసం.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి అతిథిగా శివన్న!

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలలో కేజేఎఫ్ 2 కూడా ఒకటి. అంచనాలు లేకుండా వచ్చి ‘కేజీఎఫ్‌’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో హీరో యశ్ పాన్ ఇండియా..

KGF2: యష్ కోసం.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి అతిథిగా శివన్న!

Kgf2

GF2: మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలలో కేజేఎఫ్ 2 కూడా ఒకటి. అంచనాలు లేకుండా వచ్చి ‘కేజీఎఫ్‌’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో హీరో యశ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోతే.. దర్శకుడు ప్రశాంత్ నీల్ స్టార్ దర్శకుడిగా మారిపోయాడు. ఇప్పుడు అంతా ఈ సినిమా పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ లో ‘కేజీఎఫ్‌ 2’ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ కన్నడ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

KGF2: బ్లాస్టింగ్ అప్డేట్.. ఒక్క ఇండియాలోనే 6 వేల థియేటర్లు?

ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తాజాగా వచ్చిన తుఫాన్ సాంగ్ సినిమా మీద అంచనాలను రెట్టింపు చేయగా.. మార్చ్ 27వ తేదీన ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ ట్రైలర్ లాంచ్ వేడుకకి చీఫ్ గెస్ట్ ఎవరన్నది కన్నడ పరిశ్రమలో ఆసక్తికరంగా మారగా.. కన్నడ స్టార్ హీరో, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పెద్దన్నయ్య అయిన శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

KGF2: రాకింగ్ స్టార్ సవాల్.. తుఫాన్‌ను తట్టుకోగలరా?

ఈ విషయాన్ని తాజాగా చిత్ర యూనిట్ ఒక సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించగా.. అలాగే ట్రైలర్ లాంచ్ వేడుకకు కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు టీం ప్రకటించింది. ఈ ప్రకటనతో కన్నడ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఈ ట్రైలర్ పై మరింత ఆసక్తి మొదలైంది. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో యష్ జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఒక్క సినిమాతో తన్న సత్తా ఏంటో ఇండస్ట్రీకి చెప్పిన ప్రశాంత్ నీల్ నుండి వస్తున్న ఈ సినిమాతో ఆయన ఫ్యూచర్ సినిమాలు కూడా ఆధారపడి ఉన్నాయి.