KGF2: బ్లాస్టింగ్ అప్డేట్.. ఒక్క ఇండియాలోనే 6 వేల థియేటర్లు?

ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా ‘కేజీఎఫ్‌’. ఇండియన్ సినీ చ‌రిత్ర‌లోనే అలాంటి ఎలివేష‌న్లు ఏ సినిమాలో చూడ‌లేదు. ప్ర‌శాంత్ నీల్ ఈ ఒక్క చిత్రంతో తానేంటో దేశ వ్యాప్తంగా చాటి..

KGF2: బ్లాస్టింగ్ అప్డేట్.. ఒక్క ఇండియాలోనే 6 వేల థియేటర్లు?

Kgf2

KGF2: ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా ‘కేజీఎఫ్‌’. ఇండియన్ సినీ చ‌రిత్ర‌లోనే అలాంటి ఎలివేష‌న్లు ఏ సినిమాలో చూడ‌లేదు. ప్ర‌శాంత్ నీల్ ఈ ఒక్క చిత్రంతో తానేంటో దేశ వ్యాప్తంగా చాటి చెప్పాడు. రాకింగ్ స్టార్ య‌ష్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్నాడు. ఎప్పుడెప్పుడు పార్ట్-2 వ‌స్తుందా అని సౌత్ నుంచి నార్త్ వ‌ర‌కు సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ సమయం కూడా ఆసన్నమవుతుంది.

KGF2: రాకింగ్ స్టార్ సవాల్.. తుఫాన్‌ను తట్టుకోగలరా?

హోంబలే సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమా మీద అంచనాలను భారీగా పెంచేసింది. తాజాగా వచ్చిన తుఫాన్ సాంగ్ అయితే.. బాక్సాపీస్ కు తుఫాన్ హెచ్చరిక ఇచ్చినట్లే చూస్తున్నారు. ఈ సాంగ్‌లో యశ్.. హీరోయిజం ఎలివేషన్ ఓ రేంజ్‌లో ఉంది. ఈ పాటను చూసి అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు.

KGF2: దేశాన్ని ఊపేసిన పాట.. ఐటెం భామగా అనన్య!

ముందుగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ఎప్పుడొస్తుందా అని యష్ అభిమానులతో పాటు ఇండియన్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఈ నెల 27న సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించగా.. ఈ ట్రైలర్‌ను ఐదు భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. మరోవైపు ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్‌కు అంతా సిద్ధమవుతుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించే ఈ సినిమాలో దక్షణాది నుండి భారీ క్యాస్టింగ్ నటిస్తుంది.

KGF2: తుఫాన్ దెబ్బకు కొట్టుకుపోయిన రికార్డులు!

బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్, రవీనా టాండన్ కీల‌క‌పాత్ర‌లలో న‌టిస్తుండడం నార్త్ లో కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ సినిమా నుండి ఓ బ్లాస్టింగ్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమా ఏకంగా ఒక్క ఇండియాలోనే 6 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అవుతున్నట్టుగా టాక్ మొదలైంది. ఇండియాలోని అన్ని భాషల్లో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఉండడంతో 6 వేల థియేటర్లు పెద్ద విషయం కాదు. అయితే, అప్పటికి ఆర్ఆర్ఆర్ మూడవ వారంలో ఉంటుంది. దాని రిజల్ట్ ని బట్టి ఈ సినిమాకి థియేటర్లు దొరికే అవకాశం ఉండేలా కనిపిస్తుంది.