Mahesh Babu : మహేష్‌బాబుకు మోకాలి సర్జరీ

గత కొన్నిరోజులుగా మహేష్ మోకాలికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో మోకాలి శస్త్రచికిత్స కోసం మహేశ్‌ స్పెయిన్ వెళ్లారు. స్పెయిన్ లో మహేష్ మోకాలికి ఆపరేషన్.....

Mahesh Babu : మహేష్‌బాబుకు మోకాలి సర్జరీ

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత ఏజ్ వచ్చినా తరగని అందం ఆయనది. ఆరోగ్యం కోసం చాలా కేర్ తీసుకుంటారు మహేష్. తాను ఎక్కడికి వెళ్లినా తనకు సపరేట్ చెఫ్ కూడా ఉంటాడు. బయటి ఫుడ్ తినడు, రోజూ వ్యాయామం కచ్చితంగా చేస్తాడు. ఇలా అన్నీ పాటిస్తూ తన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్ గా ఉంచుకుంటూ అందంతో కనపడతారు మహేష్. ప్రస్తుతం మహేష్ ‘సర్కారి వారి పాట’ సినిమా షూటింగ్ లో ఉన్నారు. మరి కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తే ఈ సినిమా షూట్ కంప్లీట్ అవుతుంది. ఇదయ్యాక జనవరి నుంచి త్రివిక్రమ్ సినిమా మొదలు పెడతారని అనుకున్నారు అంతా.

కాని గత కొన్నిరోజులుగా మహేష్ మోకాలికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లో మోకాలికి ఫిజియో థెరపీ చేయించుకున్నారు మహేష్. ఇటీవల మోకాలి శస్త్రచికిత్స కోసం మహేశ్‌ స్పెయిన్ వెళ్లారు. స్పెయిన్ లో మహేష్ మోకాలికి ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం స్పెయిన్ లోనే మహేష్ బాబు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నెల 24న స్పెయిన్ నుంచి దుబాయ్ కి మహేష్ వెళ్లనున్నారు.

Rana Daggubati : ఛలో పరిగెత్తు.. ఛలో పరిగెత్తు.. విప్లవ గీతం వినిపిస్తున్న రానా

అదేరోజు హైదరాబాద్ నుంచి దుబాయ్ కి మహేష్ ఫ్యామిలీ సభ్యులు కూడా వెళ్లనున్నారు. ఫ్యామిలీ సభ్యులతో క్రిస్ మస్, మరియు న్యూ ఇయర్ వేడుకలను దుబాయ్ లోనే మహేష్ బాబు జరుపుకోబోతున్నారు. మహేష్ కి మోకాలి సర్జరీ అయిందని తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్‌ మీడియాలో కామెంట్స్, పోస్టులు చేస్తున్నారు.

మహేష్ మరో రెండు నెలలు కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలి. దీంతో ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘సర్కారు వారి పాట’
సినిమా షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. తర్వాత సినిమాలు కూడా మరింత ఆలస్యం అవుతాయని తెలుస్తుంది. పిబ్రవరీ ద్వితీయార్థం లేదా మర్చి నుంచి ‘సర్కారు వారి పాట’ మిగిలిన షూటింగ్ ని పూర్తి చేస్తారని సమాచారం.