Rana Daggubati : ఛలో పరిగెత్తు.. ఛలో పరిగెత్తు.. విప్లవ గీతం వినిపిస్తున్న రానా

తాజాగా ఇవాళ రానా బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ‘వాయిస్ ఆఫ్ రవన్న’ అంటూ సినిమాలో రానాకి సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో.. 1990 ప్రాంతంలో జరిగిన యథార్థ........

Rana Daggubati : ఛలో పరిగెత్తు.. ఛలో పరిగెత్తు.. విప్లవ గీతం వినిపిస్తున్న రానా

Virata Parvam

Rana Daggubati :  భళ్లాలదేవ రానా దగ్గుబాటి హీరోగా రాబోతున్న సినిమా ‘విరాట పర్వం’. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుంది. ప్రియమణి ముఖ్యపాత్రలో నటిస్తుంది. ‘నీది నాది ఒకే కథ’ లాంటి ఎమోషనల్ సినిమాని అందించిన వేణు ఊడుగుల ‘విరాట పర్వం’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.

తాజాగా ఇవాళ రానా బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ‘వాయిస్ ఆఫ్ రవన్న’ అంటూ సినిమాలో రానాకి సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో.. 1990 ప్రాంతంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. ఇందులో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా నటిస్తున్నారు. రవన్నను ఆరాధించే అమ్మాయిగా వెన్నెల కారెక్టర్‌లో సాయి పల్లవి నటించారు. మావోయిస్టుల కథలో అంతర్లీనంగా అందమైన ప్రేమ కథను ఈ ‘విరాట పర్వం’ సినిమాలో చూపించబోతోన్నారు.

Arjun : హీరో అర్జున్‌కి కరోనా పాజిటివ్

ఈ వీడియోలో రానా వాయిస్ తో వచ్చిన విప్లవ మాటలు జనాల్ని ఆలోచింపచేసేలా ఉన్నాయి. ‘మారదులే.. ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే.. రౌద్రపు శత్రువు దాడిని ఎదురించే పోరాటం మనదే.. చలో చలో చలో పరిగెత్తు.. అడుగే పిడుగై రాలేలా గుండెల దమ్ముని చూపించు.. చలో చలో పరిగెత్తు.. చీకటి మింగిన సూర్యుని తెచ్చి తూర్పు కొండని వెలిగిద్దాం.. పొంగిన వీపుల బరువులు దించి విప్లవ గీతం వినిపిద్దాం. చలో చలో పరిగెత్తు.. దొరొల్ల తలుపుల తాళంలా.. గఢీల ముంగట కుక్కల్లా.. ఎన్నాళ్లు ఇంకెన్నాళ్లు.. చలో పరిగెత్తు.. చలో పరిగెత్తు’ అంటూ రవన్న పాత్రలో రానా చెప్పిన డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ఈ వీడియో ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ లో దూసుకెళ్తుంది.