Karan Johar : కాఫీ విత్ కరణ్.. వచ్చేస్తుంది.

కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ హాట్ స్టార్ ఓటీటీలో టెలికాస్ట్ కానుంది. ఇన్నాళ్లు బాలీవుడ్ స్టార్స్ తో చేసిన ఈ షో ఈ సారి మరింత కొత్తగా ట్రై చేస్తున్నారు. బాలీవుడ్ తో పాటు సౌత్ సెలబ్రిటీలని.............

Karan Johar : కాఫీ విత్ కరణ్.. వచ్చేస్తుంది.

Karan Johar

Koffee with Karan :  బాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాత కరణ్ జోహార్ యాంకర్ గా కాఫీ విత్ కరణ్ షో చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ షో బాలీవుడ్ లో బాగా ఫేమస్. బాలీవుడ్ లో ఉండే ప్రతి స్టార్ ఈ షోకి ఒక్కసారైనా వెళ్ళాలి అనుకుంటారు. ఇప్పటికే ఆరు సీజన్లని పూర్తి చేసుకున్న కాఫీ విత్ కరణ్ తాజాగా ఏదో సీజన్ తో రానుంది. అయితే ఈ సారి షో ఓటీటీలో టెలికాస్ట్ అవ్వనుంది.

కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ హాట్ స్టార్ ఓటీటీలో టెలికాస్ట్ కానుంది. ఇన్నాళ్లు బాలీవుడ్ స్టార్స్ తో చేసిన ఈ షో ఈ సారి మరింత కొత్తగా ట్రై చేస్తున్నారు. బాలీవుడ్ తో పాటు సౌత్ సెలబ్రిటీలని తీసుకురాబోతున్నారు. ఇటీవల సౌత్ సినిమాలు, సౌత్ యాక్టర్స్ బాలీవుడ్ లో దుమ్ము దులిపేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సౌత్ వాళ్ళని కూడా కరణ్ ఇంటర్వ్యూ చేయనున్నారు. ఈ సీజన్ లో చరణ్, తారక్, విజయ్ దేవరకొండ, సమంత, నయనతార.. ఇలా పలు సౌత్ స్టార్లు రానున్నట్టు సమాచారం.

Kamalhaasan : అక్కడ ‘బాహుబలి2’ రికార్డ్ బ్రేక్ చేసిన ‘విక్రమ్’

ఇప్పటికే విజయ్ దేవరకొండ, సమంతల ఎపిసోడ్స్ కూడా షూట్ అయిపోయినట్టు అధికారిక సమాచారం ఉంది. తాజాగా కాఫీ విత్ కరణ్ షో టెలికాస్ట్ డేట్ ని ప్రకటించారు. కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ హాట్ స్టార్ ఓటీటీలో జులై 7 నుంచి టెలికాస్ట్ అవ్వనుంది. ఇక ఈ సారి సౌత్ సెలబ్రిటీలు వస్తుండటంతో సౌత్ ఆడియన్స్ కూడా ఈ షోపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కాఫీ విత్ కరణ్ గతంలో కంటే కూడా ఈ సారి మరింత సక్సెస్ అవ్వొచ్చు అని భావిస్తున్నారు నిర్వాహకులు.