Krishnam Raju : కాలుజారి పడ్డ కృష్ణంరాజు.. అపోలో ఆస్పత్రిలో సర్జరీ..
సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రమాదవశాత్తు కాలు జారిపడ్డారు.. అపోలో వైద్యులు ఆయనకు సర్జరీ చేశారు..

Krishnam Raju
Krishnam Raju: సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు అపోలో ఆస్పత్రిలో చేరారు. సోమవారం సాయంత్రం ఇంట్లో కాలుజారి పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు కృష్ణంరాజును హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో జాయిన్ చేశారు.
MAA Elections: చిరంజీవి బాటలో ‘మా’ సభ్యులు.. కృష్ణంరాజుకు 113మంది లేఖలు
మంగళవారం ఉదయం వైద్యులు ఆయన తుంటికి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కృష్ణంరాజు ఆసుపత్రిలో చేరారని తెలియగానే సినీ వర్గాల వారు, అభిమానులు, బీజేపీ పార్టీ నాయకులు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Filmy Facts : బాహుబలి2లో ప్రభాస్ డ్యామ్ ఎందుకు పగలకొట్టాడో తెలుసా..?
ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ‘రాధే శ్యామ్’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కొంత కాలంగా ‘మా’ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. అయితే ‘ఆదిపురుష్’ షూటింగ్ నిమిత్తం బాంబేలో ఉన్న ప్రభాస్.. పెద్దనాన్నను పరామర్శించడానికి హైదరాబాద్ రానున్నట్లు సమాచారం.
Seetimaar : నా ఫ్రెండ్ సినిమా బ్లాక్‌బస్టర్..