Seetimaar : నా ఫ్రెండ్ సినిమా బ్లాక్‌బస్టర్..

నా ఫ్రెండ్ గోపిచంద్ ‘సీటీమార్’ తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది..

Seetimaar : నా ఫ్రెండ్ సినిమా బ్లాక్‌బస్టర్..

Seetimaar

Seetimaar: రెబల్ స్టార్ ప్రభాస్‌ తన ఫ్రెండ్ మాచో హీరో గోపిచంద్ సినిమా ‘సీటీమార్’ గురించి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. చాలా కాలం తర్వాత ‘సీటీమార్’ గోపికి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. పలుమార్లు రిలీజ్ వాయిదా పడినా సరే ఎట్టకేలకు థియేటర్లలోకే వచ్చిందీ స్పోర్ట్స్ బ్యాక్‌‌డ్రాప్ మూవీ.

Gopichand : ఫ్రెండ్ సినిమా కోసం ప్రభాస్..

మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి. దీన్ని బట్టి మంచి సినిమాను తెలుగు ప్రేక్షకుల తప్పకుండా ఆదరిస్తారనే మాట మరోసారి నిజమైంది. సెకండ్ వేవ్ తర్వాత పెద్ద ఎత్తున థియేటర్లలో రిలీజ్ అయ్యి, హిట్ టాక్ తెచ్చుకున్న ఫస్ట్ సినిమా ‘సీటీమార్’ కావడం విశేషం.

Prabhas 25 : టైటిల్ ఏంటి డార్లింగ్.. నోరు తిరగడం లేదు..

ఇక తన బెస్ట్ ఫ్రెండ్ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి రెబల్ స్టార్ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గోపికి, ఎంటైర్ టీంకి విషెస్ తెలియజేశారు. ‘‘నా ఫ్రెండ్ గోపిచంద్ ‘సీటీమార్’ తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సెకండ్ వేవ్ తర్వాత పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదలైన ఫస్ట్ మూవీ ఇదే. టీం అందరికీ కంగ్రాట్స్’’ అంటూ ఫ్రెండ్ సినిమాను ప్రశంసించారు ప్రభాస్.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ప్రభాస్ గెస్ట్‌గా అటెండ్ అవాల్సింది కానీ ‘ఆదిపురుష్’ షూటింగ్ కోసం బాంబేలో ఉండడంతో కుదరలేదు.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)