Gopichand : ఫ్రెండ్ సినిమా కోసం ప్రభాస్..

ప్రస్తుతం ‘ఆదిపురుష్’ షూటింగ్ కోసం బాంబేలో ఉన్న ప్రభాస్.. ప్రత్యేకంగా ఫ్రెండ్ సినిమా ఫంక్షన్‌ కోసం హైదరబాద్ రాబోతుండడం విశేషం..

Gopichand : ఫ్రెండ్ సినిమా కోసం ప్రభాస్..

Prabhas Gopichand

Gopichand: రెబల్ స్టార్ ప్రభాస్‌ ఇండస్ట్రీలో అందర్నీ ప్రేమగా డార్లింగ్ అని పలకరిస్తుంటారు. ఆయణ్ణి కూడా అందరూ అలానే పిలుస్తుంటారు. కెరీర్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలకూ పోకుండా అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు డార్లింగ్.. హీరోల్లోనూ చాలామంది ప్రభాస్‌తో సన్నిహితంగా ఉంటారు.

Prabhas : ‘డార్లింగ్, మనోళ్లు ఎక్స్‌ట్రా ఇస్తామంటున్నారు’.. అదీ ప్రభాస్ గొప్పదనం

అయితే అందరి కంటే కూడా మ్యాచో హీరో గోపిచంద్ – ప్రభాస్ ఇద్దరూ మంచి స్నేహితులు. ప్రభాస్ కెరీర్‌లో మెమరబుల్ హిట్ ‘వర్షం’ లో గోపి విలన్‌గా యాక్ట్ చేశారు. ఇద్దరూ తరుచుగా కలుస్తుంటారు. ఫ్యామిలీ ఫంక్షన్లకు హాజరవుతుంటారు. అలాగే పలు సినిమా ఫంక్షన్లకు కూడా అటెండ్ అయ్యారు. అయితే ఇప్పుడు మరోసారి తన స్నేహితుడు గోపిచంద్ సినిమా ఈవెంట్‌కి డార్లింగ్ గెస్ట్‌గా వస్తున్నారనే వార్త వైరల్ అవుతోంది.

Prabhas Gopichand

‘గౌతమ్ నంద’ తర్వాత గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్‌’. తమన్నా కథానాయిక. మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో.. పవన్‌కుమార్ స‌మ‌ర్పణ‌లో, శ్రీనివాసా సిల్వర్‌స్క్రీన్‌పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మించారు.

Radhe Shyam : సంక్రాంతికి ‘రాధే శ్యామ్’.. ‘వర్షం’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 10న థియేటర్లలో కూత పెట్టడానికి రాబోతుంది ‘సీటీమార్’.. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. పాండమిక్ తర్వాత భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న సినిమా కావడం.. ప్రోమోస్ అన్నీ కూడా గోపి చంద్ ఈసారి హిట్ కొట్టడం పక్కా అనేలా ఉండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా చెయ్యాలని డిసైడ్ అయ్యారు మేకర్స్.

Seetimaarr : సౌత్ కా సత్తా మార్ కే నయ్.. ‘సీటీ మార్’ కే దిఖాయేంగే..

అయితే ఈ కార్యక్రమానికి గోపిచంద్ క్లోజ్ ఫ్రెండ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్‌గా వస్తే బాగుంటుందనుకోగా గోపి, ప్రభాస్‌ని అడగడం.. ప్రభాస్ తప్పకుండా వస్తానని చెప్పడంతో అదిరిపోయేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు ‘సీటీమార్’ టీమ్. అతి త్వరలో డేట్, వెన్యూ అనౌన్స్ చెయ్యనున్నారు. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ షూటింగ్ కోసం బాంబేలో ఉన్న ప్రభాస్.. ప్రత్యేకంగా ఫ్రెండ్ సినిమా ఫంక్షన్‌ కోసం హైదరబాద్ రాబోతుండడం విశేషం.

Evaru Meelo Koteeswarulu : జూ. ఎన్టీఆర్ షో లో రాజమౌళి – రాఘవేంద్ర రావు..!