Prabhas : ‘డార్లింగ్, మనోళ్లు ఎక్స్‌ట్రా ఇస్తామంటున్నారు’.. అదీ ప్రభాస్ గొప్పదనం

‘బాహుబలి’ పూర్తవుతుండగా ప్రొడ్యూసర్స్ ప్రభాస్‌కి కాల్ చేసి ఎక్స్‌ట్రా రెమ్యునరేషన్ ఇస్తానని చెప్తే.. తను నాకు కాల్ చేసి.. ‘డార్లింగ్, మనోళ్లు ఎక్స్‌ట్రా డబ్బులిస్తామంటున్నారు.. తీసుకోవచ్చా..?’ అని అడిగాడు..

Prabhas : ‘డార్లింగ్, మనోళ్లు ఎక్స్‌ట్రా ఇస్తామంటున్నారు’.. అదీ ప్రభాస్ గొప్పదనం

Prabhas

Prabhas: ప్రభాస్ – రాజమౌళి.. ‘ఛత్రపతి’ లాంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్ తర్వాత వీళ్ల కాంబినేషన్‌లో ‘బాహుబలి’ లాంటి ప్రెస్టీజియస్ పాన్ ఇండియా రేంజ్ సినిమాలు రెండు పార్టులుగా వస్తాయని కానీ, తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుందని కానీ, ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌‌గా అవతరిస్తాడని కానీ ఎవరూ ఊహించలేదు.

Adipurush : ‘ఆదిపురుష్’ ఫ్యాన్ మేడ్ ఫస్ట్ లుక్..!

ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏ వార్త వచ్చినా ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తుంటుంది. రీసెంట్‌గా జక్కన్న ‘బాహుబలి’ మూవీకి సంబంధించి ప్రభాస్ పారితోషికం గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రెబల్ స్టార్ మంచి మనసుకి ఉదాహరణగా రాజమౌళి చెప్పిన ఆ విషయం ఏంటంటే..

Jr NTR – Rajamouli : ఎన్టీఆర్ – రాజమౌళి వాలీబాల్ భలే ఆడుతున్నారుగా..!

‘బాహుబలి’ పూర్తవుతుండగా ప్రొడ్యూసర్స్ ప్రభాస్‌కి కాల్ చేసి ఎక్స్‌ట్రా రెమ్యునరేషన్ ఇస్తామని చెప్తే.. తను నాకు కాల్ చేసి.. ‘డార్లింగ్, మనోళ్లు ఎక్స్‌ట్రా డబ్బులిస్తామంటున్నారు.. తీసుకోవచ్చా..?’ అని అడిగాడు.. ‘ఎక్కువ ఇస్తామంటున్నారు. మరి అలాంటప్పుడు తీసుకోవచ్చు కదా’ అన్నాను. దానికి ప్రభాస్.. ‘కాదు డార్లింగ్.. ఇప్పటికే సినిమాకి చాలా ఖర్చుపెట్టేశారు కదా డార్లింగ్’.. అన్నాడు. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్‌వ్యూలో ప్రభాస్ లాంటి స్టార్ అలా ఆలోచించడం అతని మంచి మనసుకు బెస్ట్ ఎగ్జాంపుల్.. అంటూ రెబల్ స్టార్ ఎంత మంచి వ్యక్తిత్వం కలవాడో చెప్పుకొచ్చారు రాజమౌళి.

Radhe Shyam : సంక్రాంతికి ‘రాధే శ్యామ్’.. ‘వర్షం’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?

సినిమాల విషయానికొస్తే.. జక్కన్న మరోసారి తెలుగు సినిమా సత్తాని ‘ఆర్ఆర్ఆర్’ తో ప్రపంచానికి చాటిచెప్పబోతున్నారు. డార్లింగ్ ‘రాధే శ్యామ్’ మూవీని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసేసి, ‘సలార్’ షూటింగ్ స్పీడప్ చేసేశారు. దీంతో పాటు బాలీవుడ్ డెబ్యూ ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ – వైజయంతి మూవీస్ సినిమాలు ప్యార్లల్‌గా కంప్లీట్ చెయ్యడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.

Prabhas : ‘ప్రాజెక్ట్ – కె’.. టైటిల్ అందులోనే ఉందంటగా..!