Krithi Shetty : మళ్ళీ రొమాన్స్‌తో రెచ్చిపోనున్న బేబమ్మ

కృతిశెట్టి రాబోయే మరో సినిమాలో కూడా మళ్ళీ రొమాన్స్ తో రెచ్చిపోనున్నట్లు తెలుస్తుంది. `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సినిమాలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా.....

Krithi Shetty : మళ్ళీ రొమాన్స్‌తో రెచ్చిపోనున్న బేబమ్మ

Krithi Shetty

Krithi Shetty :   ‘ఉప్పెన’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపొయింది కృతిశెట్టి. ఈ ఒక్క సినిమాతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ‘ఉప్పెన’ సినిమాలో బాగా నటించడమే కాకుండా రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా అదరగొట్టింది. తన స్మైల్, తన యాక్టింగ్, తన చూపులతో కుర్రాళ్ల‌ను కట్టి పడేసింది. రొమాంటిక్ సన్నివేశాల్లో మైమరపించింది. ఆ సినిమా తర్వాత కృతికి చాలానే ఛాన్సులు వచ్చాయి. ఇటీవల వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో నాని సరసన మరోసారి రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. నానితో లిప్ లాక్ సీన్స్, రొమాంటి సీన్స్ తో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో అదరగొట్టింది. మరోసారి కుర్రకారుని తన వైపుకి తిప్పుకుంది. తాజాగా కృతిశెట్టి రాబోయే మరో సినిమాలో కూడా మళ్ళీ రొమాన్స్ తో రెచ్చిపోనున్నట్లు తెలుస్తుంది.

 

హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ‌ చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. నిన్న ఈ సినిమాకి సంబంధిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్ లో సుధీర్ బాబు కృతి శెట్టిని వెనక నుంచి మెడ ముద్దు పెట్టుకున్నట్లు చూపించారు. ఫస్ట్ లుక్ లోనే ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలిసిపోయింది.

Shiva Karthikeyan : ‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌తో తమిళ్ స్టార్ హీరో

అంతే కాకుండా ఈ సినిమా గురించి డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ… ”ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా రొమాంటిక్ డ్రామా అని తెలిపారు. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ కూడా ఉంటుందని తెలిపారు. కృతిశెట్టిని ఉప్పెనలో చూసినప్పుడు ఇంప్రెసివ్ గా అనిపించింది. శ్యామ్ సింగరాయ్ లోనూ ఆకట్టుకుంది. ఇందులో ఆమెను మరింత కొత్తగా చూస్తారు” అని తెలిపారు. దీంతో ఈ సినిమాలో కూడా కృతిశెట్టి మరోసారి రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే కృతి రొమాన్స్ సన్నివేశాల్లో నటించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. ఇదే కొనసాగితే కృతి భవిష్యత్తులో మరిన్ని ఘాటు సన్నివేశాల్లో కనిపించడం ఖాయం అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.