krithi Shetty : రెండో సినిమాకే రెచ్చిపోయిన బేబమ్మ..

'శ్యామ్ సింగరాయ్' సినిమా సాంగ్స్ , ట్రైలర్ లో నానికి లిప్ లాక్ ఇవ్వడమే కాకుండా రెచ్చిపోయి రొమాంటిక్ సీన్స్ లో నటించింది కృతి. ఈ సినిమాలో కృతి పూర్తిగా.......

krithi Shetty : రెండో సినిమాకే రెచ్చిపోయిన బేబమ్మ..

Krithi

krithi Shetty : ‘ఉప్పెన’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపొయింది కృతిశెట్టి. ఈ ఒక్క సినిమాతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ‘ఉప్పెన’ సినిమాలో బాగా నటించడమే కాకుండా రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా అదరగొట్టింది. తన స్మైల్, తన యాక్టింగ్, తన చూపులతో కుర్రాళ్ల‌ను కట్టి పడేసింది. అయితే ‘ఉప్పెన’ సినిమాకి కృతిశెట్టికి 16 ఏళ్ళు మాత్రమే. ఆ ఏజ్ లోనే యాక్టింగ్ ఇరగదీసింది. అప్పుడే రొమాంటిక్ సన్నివేశాల్లో మైమరపించింది.

ఆ సినిమా తర్వాత కృతికి చాలానే ఛాన్సులు వచ్చాయి. ఇప్పుడు కృతిశెట్టి చేతిలో దాదాపు నాలుగు సినిమాలు ఉన్నాయి. నాని సరసన ‘శ్యామ్ సింగరాయ్’, నాగచైతన్య సరసన ‘బంగార్రాజు’, సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ సినిమాలు ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఇవి కాకుండా మరో సినిమాకి కూడా సైన్ చేసినట్టు సమాచారం. ఇంకా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ అంతా కృతిశెట్టి గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా.

Balakrishna : ఏపీ సినిమా టికెట్ల ధరలపై బాలయ్య కీలక వ్యాఖ్యలు

ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల అవ్వనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అంతకు ముందు సినిమా నుంచి సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్స్ , ట్రైలర్ లో నానికి లిప్ లాక్ ఇవ్వడమే కాకుండా రెచ్చిపోయి రొమాంటిక్ సీన్స్ లో నటించింది కృతి. ఈ సినిమాలో కృతి పూర్తిగా మోడ్రన్ క్యారెక్టర్ చేసింది. ఇందులో కృతిశెట్టి సిగరెట్ తాగే సన్నివేశాలు, నానికి లిప్ లాక్ ఇచ్చే సన్నివేశాలు, నానితో వీర లెవెల్లో రొమాన్స్ సీన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్రైలర్ లోనే ఈ రేంజ్ లో ఉంది అంటే ఇక సినిమాలో ఇంకే రేంజ్ లో రొమాన్స్ చేసిందో అని సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. 20 ఏళ్లు కూడా లేకుండానే కృతిశెట్టి రెండో సినిమాకే ఈ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేసింది అంటే ముందు ముందు భవిష్యత్తులో ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తుందో అని అంచనా వేస్తున్నారు. ఇక మొదటి సినిమాతో పోలిస్తే మూడు రేట్లు ఎక్కువగా ఈ సినిమాకి , తర్వాత వచ్చే సినిమాలకి పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ అంతా కృతిని చూసి నేర్చుకోవాలి అని అంటున్నారు. ఈ సినిమా తర్వాత కృతి ఇమేజ్ పూర్తిగా మారిపోవడం ఖాయం అంటున్నారు ప్రేక్షకులు. ఎలాగైతేనేమి మరోసారి తన రొమాంటిక్ సీన్స్ తో వార్తల్లో, సోషల్ మీడియాలో హైలెట్ గా నిలుస్తుంది బేబమ్మ.

Pushpa : గతంలో ఎడమ భుజానికి సర్జరీలు.. ‘పుష్ప’లో భుజం పైకి పెట్టుకుని నటించడంతో…