Bangarraju : కష్టమైనా కృతినే ఫిక్స్ చేశారు.. ఎంత ఇస్తున్నారో తెలుసా..!

‘సోగ్గాడే చిన్నినాయనా’ కి సీక్వెల్‌గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో చైతుకి జోడీగా కృతిని ఒప్పించడానికి మేకర్స్ చాలా ప్రయత్నాలు చేశారట..

Bangarraju : కష్టమైనా కృతినే ఫిక్స్ చేశారు.. ఎంత ఇస్తున్నారో తెలుసా..!

Bangarraju

Bangarraju: ‘ఉప్పెన’ తో బేబమ్మ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. వరుస సినిమాలు, బిజీ షెడ్యూల్స్‌తో క్షణం తీరికలేకుండా మారిపోయింది కన్నడ చిన్నది కృతి శెట్టి. ప్రస్తుతం రామ్ – లింగుస్వామి సినిమాతో పాటు సుధీర్ బాబుతోనూ నటిస్తుంది.

ఫస్ట్ సినిమాతో వచ్చిన క్రేజ్, స్టార్‌డమ్ వల్ల రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని టాక్. ఇక కొంతమంది దర్శక నిర్మాతలకు సారీ డేట్స్ అడ్జెస్ట్ కావట్లేదు అని చెప్పేస్తుందట. కృతి ఖాళీ అయిన తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేద్దామంటూ మేకర్స్ ప్లాన్స్ చేసుకుంటున్నారు.

Wild Dog : ఓటీటీలో కింగ్ నాగార్జున ‘వైల్డ్ డాగ్’ రికార్డ్!..

రీసెంట్‌గా ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీ కోసం భారీ పారితోషికం ఆఫర్ చేసి మరీ కృతి శెట్టని హీరోయిన్‌గా తీసుకున్నారనే మాట ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ‘కింగ్’ నాగార్జున, ‘యువసామ్రాట్’ నాగ చైతన్య నటించనున్న సినిమా ‘బంగర్రాజు’.

‘సోగ్గాడే చిన్నినాయనా’ కి ప్రీక్వెల్‌గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో చైతుకి జోడీగా కృతిని ఒప్పించడానికి మేకర్స్ చాలా ప్రయత్నాలు చేశారట. పలుమార్లు చర్చలు జరిగిన తర్వాత చివరకి ఆమె అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకున్నారట. ఈ సినిమాకు గాను రెమ్యునరేషన్‌గా అక్షరాలా రెండు కోట్ల రూపాయలు తీసుకుంటుందట కృతి శెట్టి.