Wild Dog : ఓటీటీలో కింగ్ నాగార్జున ‘వైల్డ్ డాగ్’ రికార్డ్!..

కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘వైల్డ్ డాగ్‌’. అహిషోర్ సోల్మ‌న్ డైరెక్ట్‌గా ఇంట్రడ్యూస్ అయ్యారు.. నాగ్ ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) అధికారి ఏసీపీ విజయ్‌ వర్మ పాత్రలో కనిపించారు..

Wild Dog : ఓటీటీలో కింగ్ నాగార్జున ‘వైల్డ్ డాగ్’ రికార్డ్!..

Wild Dog

Wild Dog: ‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘వైల్డ్ డాగ్‌’. అహిషోర్ సోల్మ‌న్ డైరెక్ట్‌గా ఇంట్రడ్యూస్ అయ్యారు.. నాగ్ ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) అధికారి ఏసీపీ విజయ్‌ వర్మ పాత్రలో కనిపించారు.. సయామీ ఖేర్, అలి రజా తదితరులు కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది..

Wild Dog

ఇటీవలే పాపులర్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.. ‘వైల్డ్ డాగ్’ కి ఓటీటీలో అనూహ్యంగా మంచి స్పందన లభిస్తోంది.. ఆడియెన్స్ అండ్ క్రిటిక్స్ నుండి ప్రశంసలు లభిస్తున్నాయి.. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ టీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు..

Wild Dog

‘వైల్డ్ డాగ్’ మూవీ తక్కువ టైంలో రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించిందట.. దక్షిణాది నాలుగు భాషల్లోనూ మంచి వ్యూస్ వచ్చాయని, దక్షిణాది రికార్డ్ బ్రేక్ చేసిందని తెలిపారు. తెలుగు వెర్షన్ ఇండియా మొత్తం మీద ట్రెండింగ్‌లో ఉండగా.. తమిళ్‌ వెర్షన్ ఐదో స్థానంలో ఉందని చెప్పారు..

Wild Dog