School Uniform : తెలంగాణలో విద్యార్థులకు అలర్ట్.. స్కూల్ యూనిఫామ్స్‌లో భారీ మార్పులు.. కొత్త డ్రెస్ కోడ్ ఇదే..
School Uniform : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్స్‌లో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త డ్రెస్ కోడ్ అమల్లోకి రానుంది.
School Uniform
School Uniform : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్స్‌లో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త డ్రెస్ కోడ్ అమల్లోకి రానుంది. ఈనెల 15వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం పున: ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు ప్రారంభమైన కొద్దిరోజులకే విద్యార్థులకు యూనిఫాంలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
గతేడాది ఇచ్చిన యూనిఫామ్స్ ఆకర్షణీయంగా లేవని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విద్యార్థుల యూనిఫాం డిజైన్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. బాలురు షర్టులు, బాలికల టాప్స్ లైట్ బ్లూ, బాలుర ప్యాంట్లు, బాలికల చుడీదార్, స్కర్ట్ ముదురు నీలం రంగులో ఉండనున్నాయి. అయితే, కొత్త యూనిఫామ్ చొక్కా ముందు జేబు, చేతులపై ముదురు నీలం రంగు పట్టీలు ఉంటాయి. బాలికల పంజాబీ డ్రెస్ చొక్కా చేతులపై, వేయిస్ట్ కోట్ వద్ద ముదురు నీలం రంగు పెట్టీలు ఉంటాయి.
విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన యూనిఫామ్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. అదేవిధంగా 6, 7వ తరగతి అబ్బాయిలకు ప్యాంట్లు తప్పనిసరి చేసింది. ఈమేరకు విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
