Rajinikanth: రజినీ కోసం రంగంలోకి మరో డైరెక్టర్

తమిళ స్టార్ హీరో రజినీకాంత్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రజినీ కెరీర్‌లోని....

Rajinikanth: రజినీ కోసం రంగంలోకి మరో డైరెక్టర్

Ks Ravikumar On Board For Rajinikanth Next Movie

Rajinikanth: తమిళ స్టార్ హీరో రజినీకాంత్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రజినీ కెరీర్‌లోని 169వ చిత్రం తెరకెక్కబోతున్నట్లు గతంలోనే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గర్నుండీ ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ మరోసారి స్టైలిష్ లుక్‌లో కనిపించనుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో సైతం అప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Rajinikanth : రజినీకాంత్ తో కార్తీ, నాజర్ భేటీ.. ఇందుకోసమేనా??

అయితే.. ఇటీవల నెల్సన్ దిలీప్ తమిళ హీరో విజయ్‌తో కలిసి బీస్ట్ అనే సినిమాను తెరకెక్కించిన ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. దీంతో రజినీ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోతో నెల్సన్ దిలీప్ ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడా అని ఆందోళన చెందుతున్నారు. అయితే.. ఇప్పుడు వారి ఆందోళనను దూరం చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. తాజాగా ఈ సినిమా కోసం మరో స్టార్ డైరెక్టర్ కూడా ఈ సినిమాలో జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది.

Rajinikanth: యంగ్ డైరెక్టర్లకి ఏరికోరి అవకాశాలిస్తున్న తలైవా.. ఫలితం ఫ్లాపులు!

తమిళ స్టార్ డైరెక్టర్ కెఎస్.రవికుమార్ గతంలో రజినీకాంత్‌కు ముత్తు, నరసింహా, లింగా వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఎలాగైనా మరో అద్భుతమైన సక్సెస్‌ను అందించాలని తలైవా స్వయంగా రవికుమార్‌ను ఈ సినిమా కోసం పనిచేయాల్సిందిగా కోరారట. ఇక ఈ సినిమాలో నెల్సన్ దిలీప్‌కు స్క్రిప్టు పనుల్లో రవికుమార్ సహాయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి రవికుమార్ ఈ సినిమాకు ఎలాంటి సక్సెస్‌ను అందించగలడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట చేయాల్సిందే. ఇక ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.