Kudi Yedamaithe Teaser : లైఫ్‌లో జరిగిందే మళ్ళీ మళ్ళీ జరిగినట్లు అనిపిస్తే..?

డైరెక్టర్ పవన్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ‘కుడి ఎడమైతే’ సిరీస్‌పై హైప్ క్రియేట్ చేశారు..

Kudi Yedamaithe Teaser : లైఫ్‌లో జరిగిందే మళ్ళీ మళ్ళీ జరిగినట్లు అనిపిస్తే..?

Kudi Yedamaithe Teaser

Kudi Yedamaithe Teaser: ప్రతి వారం ఎగ్జైటింగ్ కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న హండ్రెడ్ ప‌ర్సెంట్ ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు, వెబ్ షోల‌తో పాత్ బ్రేకింగ్ క్రియేట్ చేస్తున్న ఈ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ‘కుడి ఎడమైతే’ అనే ప్రెస్టీజియ‌స్ సిరీస్ స్ట్రీమింగ్ అవబోతోంది.

అమ‌లా పాల్‌, రాహుల్ విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇండియాలో డిజిట‌ల్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సార‌మ‌వుతున్న తొలి సైంటిఫిక‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్ ఇది. రామ్ విఘ్నేశ్ రూపొందించిన ఈ సిరీస్‌ను ‘లూసియా’, ‘యూ ట‌ర్న్’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ తెర‌కెక్కించారు. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సిరీస్ మోష‌న్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Superstars on Aha : జాతీయ స్థాయిలో ఇతర డిజిటల్ మాధ్యమాలకు గట్టిపోటీనిస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’..!

శనివారం ‘కుడి ఎడమైతే’ టీజర్ విడుదల చేసింది టీం. ‘నీకెప్పుడైనా లైఫ్‌లో జరిగిందే మళ్ళీ మళ్ళీ జరిగినట్లు అనిపించిందా? అనే ఆసక్తికరమైన డైలాగ్‌తో స్టార్ట్ చేసిన టీజర్ సస్పెన్స్‌తో థ్రిల్లింగ్‌గా అనిపించింది. అమలాపాల్, రాహుల్ విజయ్ పర్ఫార్మెన్స్, విజువల్స్, ఆర్ఆర్ హైలెట్ అవడమే కాకుండా డైరెక్టర్ పవన్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సిరీస్‌పై హైప్ క్రియేట్ చేశారు. త్వరలో ‘కుడి ఎడమైతే’ స్ట్రీమింగ్ కానుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోన్న ఈ సిరీస్‌లో ప్రేక్ష‌కుల‌కు మ‌రిన్ని స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ చూడబోతున్నారు. డైరెక్ట‌ర్ ప‌వ‌న్ కుమార్ త‌న సినిమాలతో ప్రేక్ష‌కుల్లో ఓ ఎగ్జ‌ైట్‌మెంట్‌ను క్రియేట్ చేస్తార‌నే సంగ‌తి తెలిసిందే. అదే త‌ర‌హాలో డిఫ‌రెంట్ ఎమోష‌న్స్‌, థ్రిల్స్‌, షాకింగ్ ట్విస్ట్‌ల‌తో మ‌రోసారి ఈ ద‌ర్శ‌కుడు త‌న ప్ర‌తిభ‌ను చాటుకోనున్నారు.

Aha : ‘ఆహా’ లో.. అదిరిపోయే సినిమాలు..

2021లో ‘క్రాక్‌’, ‘నాంది’, ‘లెవ‌న్త్ అవ‌ర్‌’, ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌’, ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’, ‘సుల్తాన్‌’, ‘జాంబి రెడ్డి’ వంటి సినిమాలు, వెబ్ షోల‌తో ‘ఆహా’ ప్రేక్ష‌కుల‌ను అత్య‌ద్భుతంగా ఎంట‌ర్‌టైన్ చేసింది. క్వాలిటీతో కూడిన ఎంట‌ర్‌టైన్‌మెంట్ కావాల‌నుకున్న తెలుగు ప్రేక్ష‌కుల తొలి ప్రాధాన్య‌త‌కు ఉదాహ‌ర‌ణగా నిలుస్తోంది ’ఆహా’.. హ్యాపీ స్ట్రీమింగ్..