Aha : ‘ఆహా’ లో.. అదిరిపోయే సినిమాలు..

ఎక్స్‌‌క్లూజివ్ అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తోంది ‘ఆహా’..

Aha : ‘ఆహా’ లో.. అదిరిపోయే సినిమాలు..

Aha

Aha: ప్రతి వారం ఎగ్జైటింగ్ కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న హండ్రెడ్ ప‌ర్సెంట్ ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు, వెబ్ షోల‌తో పాత్ బ్రేకింగ్ క్రియేట్ చేస్తున్న ఈ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. ఇప్పుడు ఎక్స్‌‌క్లూజివ్ అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తోంది ‘ఆహా’.. ఈ పాపులర్ ఓటీటీ రైట్స్ తీసుకున్న సినిమాలేంటో చూద్దాం..

Kudi Yedamaithe : ‘ఆహా’లో అమ‌లాపాల్ న‌టించిన సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్ల‌ర్.. ‘కుడి ఎడమైతే’..

యూత్‌లో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో నాగ శౌర్య సరికొత్త పాత్రలో కనిపించబోతున్న చిత్రం ‘లక్ష్య’.. ఆర్చరీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సోనాలీ నారంగ్ సమర్పణలో.. నారయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావ్, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Lakshya

 

యంగ్ హీరో అఖిల్ అక్కినేని, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ కామెడీ మూవీ.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, దర్శకుడు వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు.

Most Eligible Bachelor

 

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్నబ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరి’.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. నిర్మిస్తున్నాయి.. ఏప్రిల్ 16న రిలీజ్ కావాల్సిన ‘లవ్ స్టోరి’ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది..

Love Story

 

2021లో ‘క్రాక్‌’, ‘నాంది’, ‘లెవ‌న్త్ అవ‌ర్‌’, ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌’, ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’, ‘సుల్తాన్‌’, ‘జాంబి రెడ్డి’ వంటి సినిమాలు, వెబ్ షోల‌తో ‘ఆహా’ ప్రేక్ష‌కుల‌ను అత్య‌ద్భుతంగా ఎంట‌ర్‌టైన్ చేసింది. క్వాలిటీతో కూడిన ఎంట‌ర్‌టైన్‌మెంట్ కావాల‌నుకున్న తెలుగు ప్రేక్ష‌కుల తొలి ప్రాధాన్య‌త‌కు ఉదాహ‌ర‌ణగా నిలుస్తోంది ’ఆహా’.. హ్యాపీ స్ట్రీమింగ్..

Kudi Yedamaithe : ‘ఆహా’లో అమ‌లాపాల్ న‌టించిన సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్ల‌ర్.. ‘కుడి ఎడమైతే’..