Kushi : విజయ్ దేవరకొండ బర్త్ డే గిఫ్ట్.. ఖుషి ఫస్ట్ సాంగ్ రిలీజ్!

విజయ్ దేవరకొండ బర్త్ డే కానుకగా తన నటిస్తున్న ఖుషీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. నా రోజా నువ్వే అంటూ సాగే మెలోడీ..

Kushi : విజయ్ దేవరకొండ బర్త్ డే గిఫ్ట్.. ఖుషి ఫస్ట్ సాంగ్ రిలీజ్!

Kushi first song released on the occasion of vijay deverakonda birthday

Kushi : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషీ’. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్. తాజాగా నేడు విజయ్ దేవరకొండ బర్త్ డే కానుకగా మూవీలోని ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండడంతో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ లాంగ్వేజ్స్ లో కూడా ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

Samantha : నా ఫేవరేట్ యాక్టర్ అంటూ.. విజయ్ దేవరకొండకు సమంత స్పెషల్ బర్త్ డే విషెష్..

నా రోజా నువ్వే అంటూ సాగే సాంగ్ కి దర్శకుడు శివ నిర్వాణ లిరిక్స్ అందిచాడు. సంగీత దర్శకుడు అబ్దుల్ వహాబ్ పాటని పాడాడు. ఇక సాంగ్ మొత్తం కాశ్మీర్ లోయల్లో కథ వెనుక సాగుతుంది. ఈ సినిమాలో సమంత ముస్లిం యువతిగా కనిపించబోతుంది. సాంగ్ లో విలేజ్ అండ్ సమంత మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. మైత్రీ నిర్మాణ విలువలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాంగ్ విజువల్స్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. చూస్తుంటే ఆడియన్స్ కి ఈ మూవీ ఒక కొత్త అనుభూతుని ఇవ్వబోతోందని తెలుస్తుంది.

Naga Chaitanya : సమంత మంచి అమ్మాయి.. ఆమె సంతోషంగానే ఉండాలి.. నాగచైతన్య కామెంట్స్!

ఇక లైగర్ తో విజయ్ కి పాన్ ఇండియా సక్సెస్ మిస్ అయ్యింది. ఈ సినిమాతో ఆ ముచ్చటని తీర్చుకునేలా ఉన్నాడు. శివ నిర్వాణ లవ్ మూవీస్ ని చాలా సెన్సిబుల్ గా తెరకెక్కిస్తాడని ఆడియన్స్ లో మంచి పేరు ఉంది. అతను తెరకెక్కించిన నిన్ను కోరి, మజిలీ సినిమాలు ప్రేక్షకుల మనసుని హత్తుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాని కూడా అదే తరహాలో తెరకెక్కిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో సమంతకి కూడా సరైన విజయం లేదు. మరి దర్శకుడు వీరిద్దరికి మంచి విజయాన్ని అందించి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడా? లేదా? చూడాలి.