Samantha : నా ఫేవరేట్ యాక్టర్ అంటూ.. విజయ్ దేవరకొండకు సమంత స్పెషల్ బర్త్ డే విషెష్..
నేడు మే 9న విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు విజయ్ కు సోషల్ మీడియా వేడుకగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత కూడా విజయ్ కి స్పెషల్ గా విషెష్ తెలిపింది.
Samantha : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో గుర్తింపు తెచ్చుకొని పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా తర్వాత ఎన్ని హిట్స్, ఫ్లాప్స్ వచ్చినా విజయ్ కి మాత్రం క్రేజ్ అలాగే ఉంది. యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ విజయ్ కి ఎక్కువే. సినిమాలతోనే కాకుండా, తన స్పీచ్ లు, యాటిట్యూడ్, యాడ్స్.. ఇలా అన్ని రకాలుగా యూత్ కి బాగా దగ్గరయ్యాడు విజయ్ దేవరకొండ. అమ్మాయిల్లో కూడా విజయ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
నేడు మే 9న విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు విజయ్ కు సోషల్ మీడియా వేడుకగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత కూడా విజయ్ కి స్పెషల్ గా విషెష్ తెలిపింది. సమంత, విజయ్ గతంలో మహానటి సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు ఖుషి సినిమాలో మరోసారి కలిసి నటిస్తున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. తాజాగా సమంత విజయ్ దేవరకొండ బర్త్డే CDPని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. నా గుడ్ ఫ్రెండ్, నాకు చాలా ఇష్టమైన నా ఫేవరేట్ యాక్టర్ విజయ్ దేవరకొండ బర్త్డే CDPని లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నీ సక్సెస్ కోసం నేను ప్రే చేస్తాను. నీకు లైఫ్ లో ప్రతి దాంట్లోను బెస్ట్ దొరకాలి. నువ్వు దానికి అర్హుడవు అని రాసింది. దీంతో సమంత పోస్ట్ వైరల్ గా మారింది.
గత సంవత్సరం సమంత పుట్టిన రోజుని ఖుషి సినిమా చిత్రీకరణ సమయంలో విజయ్ దేవరకొండ గ్రాండ్ గా చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరూ ఖుషి షూటింగ్ లోనే ఉన్నారు. మరి సమంత విజయ్ బర్త్డే కి ఏమన్నా స్పెషల్ సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తుందేమో చూడాలి.