Lata Mangeshkar : లతా మంగేష్కర్ ఆస్తులు ఎవరికి??

గతంలో మీడియా నివేదికల ప్రకారం లతా మంగేష్కర్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు దాదాపు 200 కోట్లకు పైనే. ఆమె ప్రస్తుతం ప్రభు కుంజ్ అనే నివాసంలో ఉంటుంది. అంతే కాక ముంబై........

Lata Mangeshkar :  లతా మంగేష్కర్ ఆస్తులు ఎవరికి??

Lata Mangeshkar Family

Lata Mangeshkar :   భారతదేశ గాన కోకిల లతా మంగేష్కర్‌ నిన్న ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం సినీ, రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు, అభిమానుల మధ్య మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఆమె మరణం భారత సినీ సంగీత పరిశ్రమకి తీరని లోటు. ఆమె మరణంతో అందరూ ఆమె లైఫ్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే ఇప్పుడు చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న లతా మంగేష్కర్ ఆస్తులు ఎవరికి? అని. లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోలేదు. జీవితాంతం బ్రహ్మచారిణిగానే ఉండిపోయింది. దీంతో ఇప్పుడు ఆమె ఆస్తులు ఎవరికి చెందుతాయి అని వార్తలు వస్తున్నాయి. లతా మంగేష్కర్‌కు ముగ్గురు చెల్లెళ్ళు ఒక సోదరుడు. ఆశా భోంస్లే, మీన ఖడికర్, ఉషా మంగేష్కర్, హృదయనాథ్ మంగేష్కర్. వీరంతా కూడా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. చిన్నప్పటి నుంచి కూడా చదువు మానేసి మరీ తన జీవితం అంతా కుటుంబాన్ని పోషించడం కోసం కష్టపడింది. దీంతో ఇప్పుడు ఆమె ఆస్తులు వీరి అందరికి కలిపి దక్కుతాయని అంటున్నారు.

Lata Mangeshkar : నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా లతా మంగేష్కర్

గతంలో మీడియా నివేదికల ప్రకారం లతా మంగేష్కర్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు దాదాపు 200 కోట్లకు పైనే. ఆమె ప్రస్తుతం ప్రభు కుంజ్ అనే నివాసంలో ఉంటుంది. అంతే కాక ముంబై పెద్దర్ రోడ్లో మరో విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. ఆమెకి పాటల ద్వారానే కాక రెంట్స్ రూపంలో కూడా సంపాదన వస్తుంది. ఆమె పాడిన పాటలకు రాయల్టీ ద్వారా సంవత్సరానికి దాదాపు 5 కోట్ల పైగానే ఆదాయం వస్తోందని తెలుస్తుంది.

Lata Mangeshkar : రాజకీయాల్లో లతా మంగేష్కర్..

లతాజీ ఉన్నంతవరకు కుటుంబాన్ని ఏకతాటిపై నడిపించింది. చెల్లెల్లు, తమ్ముడు పెళ్లిళ్లు చేసుకున్నా అందరితో సత్సంబంధాలు కొనసాగించింది. మరి ఇప్పుడు లతాజీ మరణించాక ఆ కుటుంబం అలాగే ఉంటారా? ఆస్తులు వారంతా సమానంగా పంచుకుంటారా? లేక లతాజీ తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్ట్ కి ఇస్తారా? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ సమాధానం రావాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.