Lata Mangeshkar : నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా లతా మంగేష్కర్

లతా మంగేష్కర్ అందరికి సింగర్ గానే తెలుసు. కానీ ఆమె నిర్మాతగా సినిమాలు కూడా నిర్మించారు. మ్యూజిక్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలకు సంగీతం కూడా అందించారు. లతా మంగేష్కర్ తొలిసారిగా......

Lata Mangeshkar :  నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా లతా మంగేష్కర్

Lataji

Lata Mangeshkar :  భారతదేశ గాన కోకిల లతా మంగేష్కర్‌ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆదివారం సాయంత్రం సినీ, రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు, అభిమానుల మధ్య మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఆమె మరణం భారత సినీ సంగీత పరిశ్రమకి మాత్రమే కాదు దేశానికి కూడా తీరని లోటు. ఆమె మరణంతో ఒక్కసారిగా సంగీత పరిశ్రమ మూగదయింది. అందరూ ఆమె లైఫ్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే లతా మంగేష్కర్ అందరికి సింగర్ గానే తెలుసు. కానీ ఆమె నిర్మాతగా సినిమాలు కూడా నిర్మించారు. మ్యూజిక్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలకు సంగీతం కూడా అందించారు. లతా మంగేష్కర్ తొలిసారిగా 1960లో మరాఠీ చిత్రం ‘రామ్ రామ్ పవన’కి సంగీతం అందించారు. ఆ తర్వాత 1963లో ‘మరాఠా టిటుకా మెల్వావా’, 1963లో ‘మోహిత్యాంచి మంజుల, 1965లో ‘సాధి మనసే’, 1969లో ‘తాంబడి మతి’ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాల్లో పాటలు కూడా పాడారు. వీటికి అవార్డులు కూడా వచ్చాయి.

Lata Mangeshkar : రాజకీయాల్లో లతా మంగేష్కర్..

నిర్మాతగా లతా మంగేష్కర్ నాలుగు చిత్రాలను నిర్మించారు. 1953లో మరాఠిలో ‘వాడల్’ సినిమాని నిర్మించారు. ఆ తర్వాత 1953లో హిందీలో ‘ఝాంఝర్’, 1955లో హిందీలో ‘కంచన్ గంగ’, 1990లో హిందీలో ‘లేకిన్’ సినిమాను నిర్మించారు. లేకిన్ సినిమాకు అయిదు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఆమెని సినిమాల్లో నటించమని చాలా మంది అడిగినా సున్నితంగా తిరస్కరించారు.