Bheemla Nayak : పవన్ అభిమానులపై లాఠీ ఛార్జ్..

తెలంగాణాలో కొన్ని థియేటర్లలో బెనిఫిట్ షో అనౌన్స్ చేయడంతో రాత్రే పవన్ అభిమానులు ఆయా థియేటర్ల వద్ద పడిగాపులు కాశారు. హైదరాబాద్ కూకట్ పల్లి అర్జున్ థియేటర్, భ్రమరాంబ థియేటర్లలో.......

Bheemla Nayak : పవన్ అభిమానులపై లాఠీ ఛార్జ్..

Bheemla Nayak Lati Charge

Pawan Kalyan :  పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఒక పక్క ఏపీలో బెనిఫిట్ షోలు వేసినా, అధిక చార్జీలు వసూలు చేసినా థియేటర్లపై చర్యలు తప్పవు అని నోటీసులు జారీ చేశారు. మరో పక్క తెలంగాణలో అయిదవ షోకి కూడా పర్మిషన్ ఇచ్చారు. టికెట్ల రేట్లను పెంచుకునే వెసులుబాటు కూడా కల్పించారు.

తెలంగాణాలో కొన్ని థియేటర్లలో బెనిఫిట్ షో అనౌన్స్ చేయడంతో రాత్రే పవన్ అభిమానులు ఆయా థియేటర్ల వద్ద పడిగాపులు కాశారు. హైదరాబాద్ కూకట్ పల్లి అర్జున్ థియేటర్, భ్రమరాంబ థియేటర్లలో బెనిఫిట్ షో వేస్తున్నారని తెలియగానే రాత్రి నుంచే పవన్ అభిమానులు థియేటర్స్ వద్ద కోలాహలం చేశారు. భారీగా పవన్ అభిమానులు రావడంతో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. థియేటర్ గేట్లు ఎక్కి హడావిడి చేయడంతో పవన్ అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. కూకట్ పల్లి అర్జున్ థియేటర్ వద్ద బెనిఫిట్ షో కోసం వచ్చి థియేటర్ గేట్లను తోసే ప్రయత్నం చేయడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు.

Durgavva : ‘భీమ్లా నాయక్’ సినిమాలో ‘అడవితల్లి..’ పాటకి దుర్గవ్వ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఇక ఇప్పటికే బెనిఫిట్ షో అయిపోవడంతో సినిమా అభిమానులకు కన్నులపండుగగా ఉందని అంటున్నారు. తెలంగాణాలో చాలా చోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. అటు ఏపీలో మాత్రం ఇప్పటివరకు ఒక్క షో కూడా పడకపోవడంతో పవన్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.