Durgavva : ‘భీమ్లా నాయక్’ సినిమాలో ‘అడవితల్లి..’ పాటకి దుర్గవ్వ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుర్గవ్వ ఈ పాట గురించి మాట్లాడుతూ.. ''సిరిసిల్ల సిన్నది, ఉంగురము పాటలు పాడాను. అవి మంచి విజయం సాధించాయి. అది విని భీమ్లానాయక్‌లో పాట పాడమని ఆఫర్‌....

Durgavva : ‘భీమ్లా నాయక్’ సినిమాలో ‘అడవితల్లి..’ పాటకి దుర్గవ్వ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Durgavva

 

Bheemla Nayak :  ‘భీమ్లా నాయక్’ సినిమా రేపే రిలీజ్ అవ్వబోతుంది. పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా సినిమాలని వాయిదా వేసుకొని మరీ పవన్ సినిమా కోసం ఎదురు చుస్తున్నామంటూ తెలిపారు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై మరింత హైప్ వచ్చింది. ఇప్పటికే ఆన్లైన్ టికెట్స్ ఉన్న ప్రదేశాల్లో టికెట్స్ మొత్తలు సేల్ అయిపోయాయి. మరోవైపు భీమ్లా నాయక్ కి సంబంధించిన వారిని మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తున్నాయి.

తాజాగా ‘భీమ్లా నాయక్’ సినిమాలో అడవి తల్లి పాట పాడిన దుర్గవ్వ ఇంటర్వ్యూ ఇచ్చింది. భీమ్లా నాయక్ సినిమాలో జానపద కళాకారులకి అవకాశం ఇచ్చి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. మొగిలయ్యతో పాటు దుర్గవ్వకి కూడా సినిమాలో పాట పాడటానికి అవకాశం ఇచ్చారు. సింగర్ సాహితి చాగంటితో కలిసి కుమ్మరి దుర్గవ్వ పాడిన ‘అడవితల్లి’ పాట కూడా బాగా పాపులర్ అయింది. ఈ సినిమా గురించి, పాట గురించి ఇంటర్వ్యూలో తెలిపింది దుర్గవ్వ.

Bheemla Nayak: బెనిఫిట్ షో వేస్తే కఠిన చర్యలే.. ఏపీ ప్రభుత్వం నోటీసులు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుర్గవ్వ ఈ పాట గురించి మాట్లాడుతూ.. ”సిరిసిల్ల సిన్నది, ఉంగురము పాటలు పాడాను. అవి మంచి విజయం సాధించాయి. అది విని భీమ్లానాయక్‌లో పాట పాడమని ఆఫర్‌ వచ్చింది. ఇచ్చిన పాటని ఐదారు నిమిషాల్లో పాడేశాను. డబ్బుల సంగతి నేను చూసుకోను. కానీ ఈ పాట పాడినందుకు ముందు అడ్వాన్స్ 10 వేలు ఇచ్చారు. ఆ తర్వాత మిగిలిన డబ్బును నా కూతురుకు ఇచ్చి పంపించారు” అని తెలిపింది.

Bheemla Nayak : ఘనంగా ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుక

ఏది ఏమైనా ఈ సినిమా వల్ల ఇద్దరు మారుమూల ప్రాంతాల్లోని జానపద కళాకారులకి గుర్తింపు వచ్చింది. కిన్నెర మొగిలయ్యకి ఈ సినిమాతో బాగా పాపులారిటీతో పాటు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సినిమా రిలీజ్ అయ్యాక వీరికి మరిన్ని అవకాశాలు వస్తాయని అంతా ఆశిస్తున్నారు.