Varun Tej-Lavanya Tripathi: వరుణ్‌తో లవ్ ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన లావణ్య!

మెగా ఫ్యామిలీలో ఎంతో మంది హీరోలు ఉన్నా.. అందులో యంగ్ హీరో వరుణ్ తేజ్ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఆరడుగుల అందగాడిగా..

Varun Tej-Lavanya Tripathi: వరుణ్‌తో లవ్ ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన లావణ్య!

Varun Tej-Lavanya Tripathi: మెగా ఫ్యామిలీలో ఎంతో మంది హీరోలు ఉన్నా.. అందులో యంగ్ హీరో వరుణ్ తేజ్ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఆరడుగుల అందగాడిగా, మెగా ప్రిన్స్‌ గా వరుణ్ గుర్తింపు సంపాదించుకున్నాడు. కంచె, ఫిదా లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న వరుణ్.. ప్రస్తుతం గని అనే యాక్షన్ సినిమా చేస్తున్నాడు. కాగా.. మెగా హీరో వరుణ్ ప్రేమలో పడ్డాడని.. ఓ హీరోయిన్ తో ప్రేమాయణం సాగిస్తున్న ఈ యువహీరో తన బర్త్ డే రోజున ప్రేయసి కోసమే వెళ్లాడని సోషల్ మీడియా కోడై కూసింది.

Shyam Singha Roy: ఈ శుక్రవారం నుండే ఓటీటీలో శ్యామ్ సింగరాయ్!

అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ తో ‘మిస్ట‌ర్‌’, ‘అంత‌రిక్షం’ అనే సినిమాలు చేసింది. ఈ సినిమాల సమయంలో వీరి మధ్య స్నేహం చిగురించి అది ప్రేమగా మారిందని.. పుట్టినరోజు నాడు వరుణ్ లావణ్య కోసమే బెంగళూరు వెళ్లాడని.. అక్కడే ఆమెకి ప్రపోజ్ చేశాడని.. ఏదేదో పుకార్లు సోషల్ మీడియాలో పుట్టుకొచ్చాయి. గత రెండు మూడు రోజులుగా సాగుతున్న ఈ ప్రచారంపై మెగా ఫ్యామిలీ నుండి ఎలాంటి స్పందన లేదు కానీ లావణ్య మాత్రం ఒకే ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చేసింది.

Mahesh Babu: తగ్గేదేలే.. స్టార్ డైరెక్టర్స్‌ను లైన్‌లో పెట్టేసిన మహేష్!

ప్ర‌స్తుతం తాను సొంతూరు డెహ్రాడూన్‌లో కుటుంబంతో ఉన్నట్లు చెప్పిన లావణ్య.. అక్కడి ఫోటోలను షేర్ చేసింది. ‘ప్ర‌స్తుతం డెహ్రాడూన్‌లో ఫ్యామిలీతో సంతోషంగా గ‌డుపుతున్నా. మా ఊరి అందాల‌ను ఆస్వాదిస్తున్నాను’ అని తన ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చింది లావణ్య. దీంతో రెండు రోజులుగా వస్తున్న ప్రేమ, పెళ్లి పుకార్లకు తెరపడినట్లయింది. వరుణ్ బెంగళూరులో ఉంటే.. లావణ్య డెహ్రాడూన్ లో ఉంది. ఈ పోస్టులతో ప్రస్తుతం వరుణ్ తో లేనని ప్రేమ, పెళ్లి రూమర్ పై పరోక్షంగా ఒక కౌంటర్ ఇచ్చినట్లు అర్ధమవుతోంది.