Shyam Singha Roy: ఈ శుక్రవారం నుండే ఓటీటీలో శ్యామ్ సింగరాయ్!

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో వచ్చిన 'శ్యామ్‌ సింగరాయ్‌' సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న విడుదలైన బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది.

Shyam Singha Roy: ఈ శుక్రవారం నుండే ఓటీటీలో శ్యామ్ సింగరాయ్!

Shyam Singha Roy

Updated On : January 20, 2022 / 6:16 PM IST

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న విడుదలైన బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. నాని సరసన కృతిశెట్టి, సాయిపల్లవి జంటగా నటించగా.. దేవదాసి పాత్రలో సాయి పల్లవి నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మడోన్నా సెబాస్టియన్‌ కీలక పాత్రలో నటించింది.

Mahesh Babu: తగ్గేదేలే.. స్టార్ డైరెక్టర్స్‌ను లైన్‌లో పెట్టేసిన మహేష్!

థియేటర్లలో సూపర్ సక్సెస్ సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలకి సమయం వచ్చేసింది. శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం రెండు సంస్థల మధ్య పోటీ నెలకొనగా ఫైనల్ గా భారీ ధర చెల్లించి నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జనవరి 21న స్ట్రీమింగ్ కి తీసుకురానున్నారు. ఈ మూవీ విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేసుకోవాలని ముందే ఒప్పందం చేసుకోగా.. రెండు రోజుల ముందే ప్రసారం కానుంది.

Deepthi Sunaina: లంగా ఓణీలో దీప్తి సునయన క్యూట్ లుక్స్!

దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన రాగా.. ఈ శుక్రవారం నుండే స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి హడావుడి తగ్గిన తర్వాత వచ్చే వీకెండ్ ను శ్యామ్ సింగరాయ్ క్యాష్ చేసుకొనే ఆలోచనలోనే ఈ రిలీజ్ ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తుంది. మరి ఓటీటీలో శ్యామ్‌ సింగరాయ్‌కి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందన్నది చూడాల్సి ఉంది.