Liger : భారీ ధరకు అమ్ముడైన ‘లైగర్’ డిజిటల్ రైట్స్

తాజాగా లైగర్ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్టు సమాచారం వస్తుంది. విజయ్‌ దేవరకొండ ఫాలోయింగ్, బాలీవుడ్ మార్కెట్, కరణ్ జోహార్ మార్కెట్ ఇలా అన్ని లెక్కలు వేసుకొని.......

Liger : భారీ ధరకు అమ్ముడైన ‘లైగర్’ డిజిటల్ రైట్స్

Liger

 

Liger :  పూరి జగన్నాథ్‌ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది ‘లైగర్’ సినిమా. ఈ సినిమాని కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, ఛార్మి పిసి కనెక్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూడా నటించడం విశేషం. ఇప్పటికే ‘లైగర్’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా ఆగస్టు 25న విడుదల చేస్తామని ప్రకటించారు.

 

ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. కేవలం విజయ్, పూరీని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టారు. ఈ సినిమాతో ఎలాగైనా భారీ హిట్ కొట్టి 100 కోట్లకు పైగా సాధించాలని అనుకుంటున్నారు ‘లైగర్’ సినిమా టీం. తాజాగా లైగర్ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్టు సమాచారం వస్తుంది. విజయ్‌ దేవరకొండ ఫాలోయింగ్, బాలీవుడ్ మార్కెట్, కరణ్ జోహార్ మార్కెట్ ఇలా అన్ని లెక్కలు వేసుకొని అన్ని భాషల డిజిటల్ రైట్స్ ని అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ ఏకంగా 60కోట్లకు సొంతం చేసుకుందని సమాచారం..

Meenakshi Chaudhary : ముద్దు సీన్స్‌లో నటించడానికి ఇబ్బంది లేదు.. రవితేజతో లిప్‌లాక్‌ పై హీరోయిన్ వ్యాఖ్యలు

అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విజయ్ సినిమా ఈ రేంజ్ లో అమ్ముడుపోవడంతో ‘లైగర్’ సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగాయి. సినీ వర్గాల్లో కూడా ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ డిజిటల్ రైట్స్ తో దాదాపు సినిమాకి పెట్టిన బడ్జెట్ వచ్చేసినట్టే. కచ్చితంగా ఈ సినిమా భారీ హిట్ కొట్టి 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు.