Meenakshi Chaudhary : ముద్దు సీన్స్‌లో నటించడానికి ఇబ్బంది లేదు.. రవితేజతో లిప్‌లాక్‌ పై హీరోయిన్ వ్యాఖ్యలు

ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి అనేక ఆసక్తికర విశేషాలని తెలియచేస్తూ లిప్ లాక్ సీన్స్ గురించి కూడా తెలిపింది. మీనాక్షి మాట్లాడుతూ.. ''నా రెండో సినిమానే రవితేజ గారితో కలిసి చేస్తానని...

Meenakshi Chaudhary :  ముద్దు సీన్స్‌లో నటించడానికి ఇబ్బంది లేదు.. రవితేజతో లిప్‌లాక్‌ పై హీరోయిన్ వ్యాఖ్యలు

Meenakshi

Khiladi :   సుశాంత్ హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన నటి మీనాక్షి చౌదరి. ఆ సినిమా యావరేజ్ గా నిలిచినా మీనాక్షికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక రెండవ సినిమానే మాస్‌ మహారాజా రవితేజ సరసన నటించింది. రవితేజ హీరోగా వస్తున్న ‘ఖిలాడి’ సినిమాలో మీనాక్షి నటించింది. ఖిలాడీ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవలే ‘ఖిలాడీ’ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో మీనాక్షి రవితేజతో కలిసి రెచ్చపోయి రొమాన్స్ చేసినట్టు చూపించారు. రవితేజకి లిప్ లాక్ కూడా ఇచ్చింది. ట్రైలర్ లోనే ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమాలో ఏ రేంజ్ లో రొమాన్స్ ఉంటుందో అని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే రెండో సినిమాకే ఈ రేంజ్ లో రెచ్చిపోయి నటించడంతో మీనాక్షి హాట్ టాపిక్ గా మారింది. త్వరలో ఈ సినిమా రిలీజ్ అవుతుండగా ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా మీనాక్షి చౌదరి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

Writing With Fire : ఆస్కార్ నామినేషన్స్ లో ఇండియన్ డాక్యుమెంటరీ ఫిలిం

ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి అనేక ఆసక్తికర విశేషాలని తెలియచేస్తూ లిప్ లాక్ సీన్స్ గురించి కూడా తెలిపింది. మీనాక్షి మాట్లాడుతూ.. ”నా రెండో సినిమానే రవితేజ గారితో కలిసి చేస్తానని అనుకోలేదు. ఆయన టైమింగ్ మామూలుగా లేదు. తెలుగు అంతగా రాకపోవడం వల్ల నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ రవితేజ గారు కంగారు పడొద్దు అని సపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమాలో లిప్ లాక్ ఉంది. కథకు అవసరం కనుకనే చేశాను. సినిమాలో నా పాత్ర ఎంత సేపు ఉంటుంది అని ఆలోచించను. కథలో నా పాత్రకి ఎంత ప్రాముఖ్యత ఉంటుంది అని చూస్తాను. డైరెక్టర్ రమేష్ వర్మ కథ చెప్పినప్పుడే ఈ సినిమాలో కిస్ సీన్స్, రొమాన్స్ ఉంటాయని చెప్పారు. ఇలాంటి కమర్షియల్ సినిమాల్లో అవి మామూలే. ముద్దు సన్నివేశాల్లో నటించడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు” అని తెలిపింది. దీంతో భవిష్యత్తులో కూడా మీనాక్షి నుంచి మరిన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్న మూవీస్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.