IPL 2023:ఉప్ప‌ల్‌లో మ‌రో ఓట‌మి.. స‌న్‌రైజ‌ర్స్ పై ల‌క్నో విజ‌యం.. హైద‌రాబాద్ ప్లే ఆఫ్స్ ఆశ‌లు గ‌ల్లంతు..!

ఐపీఎల్‌ 2023 సీజ‌న్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఏ మాత్రం క‌లిసి రావ‌డం లేదు. దాదాపు అన్ని జ‌ట్లు సొంత గ‌డ్డ‌పై విజ‌యాలు సాధిస్తుంటే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మాత్రం ప‌రాజయాలు చ‌విచూస్తోంది.

IPL 2023:ఉప్ప‌ల్‌లో మ‌రో ఓట‌మి.. స‌న్‌రైజ‌ర్స్ పై ల‌క్నో విజ‌యం.. హైద‌రాబాద్ ప్లే ఆఫ్స్ ఆశ‌లు గ‌ల్లంతు..!

LSG Win

SRH vs LSG: ఐపీఎల్‌(IPL) 2023 సీజ‌న్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌( Sunrisers Hyderabad)కు ఏ మాత్రం క‌లిసి రావ‌డం లేదు. దాదాపు అన్ని జ‌ట్లు సొంత గ‌డ్డ‌పై విజ‌యాలు సాధిస్తుంటే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మాత్రం ప‌రాజయాలు చ‌విచూస్తోంది. ల‌క్నోతో జ‌రిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓట‌మితో స‌న్‌రైజ‌ర్స్ త‌న ప్లే ఆఫ్స్ ఆశ‌ల‌ను సంక్లిష్టం చేసుకుంది.

స‌న్‌రైజ‌ర్స్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ల‌క్నో 19.2 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో ప్రేరక్ మన్కడ్ (64నాటౌట్‌; 45 బంతుల్లో 7 పోర్లు, 2 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించ‌గా ఆఖ‌ర్లో నికోల‌స్ పూర‌న్‌( 44నాటౌట్‌; 13 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) దంచికొట్టాడు. మార్క‌స్ స్టోయినిస్‌( 40; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) దూకుడుగా ఆడాడు. ఈ విజ‌యంతో ల‌క్నో ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవంగా ఉన్నాయి. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో అభిషేక్ శ‌ర్మ‌, మ‌యాంక్ మార్కండే, గ్లెన్ ఫిలిఫ్స్ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

IPL 2023: హైద‌రాబాద్‌పై ల‌క్నో విజ‌యం

అంత‌క‌ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్‌ హైద‌రాబాద్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగులు చేసింది. స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో హెన్రిచ్ క్లాసెన్(47; 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), అబ్దుల్ స‌మ‌ద్‌(37నాటౌట్‌; 25 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స‌ర్లు) అన్మోల్‌ప్రీత్ సింగ్(36; 27 బంతుల్లో 7 ఫోర్లు) రాణించారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో కృనాల్ పాండ్యా రెండు వికెట్లు తీయ‌గా యుధ్వీర్ సింగ్ చరక్, ఆవేష్ ఖాన్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్ ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

IPL 2023: ఉప్ప‌ల్‌లో గౌత‌మ్ గంభీర్‌ను టార్గెట్ చేసిన అభిమానులు.. కోహ్లి కోహ్లి అంటూ..