Aadavaallu Meeku Joharlu: లక్కీ గర్ల్ రష్మిక.. శర్వాకి లక్ కలిసి వస్తుందా?

సినిమా హిట్ ఫార్ములా పట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు శర్వానంద్. వరుసగా హిట్ సినిమాలతో దూసుకెళ్తోంది రష్మిక. ఈ ఇద్దరూ కలసి సినిమా చేస్తారని ఎవ్వరూ ఊహించి ఉండరు.

Aadavaallu Meeku Joharlu: లక్కీ గర్ల్ రష్మిక.. శర్వాకి లక్ కలిసి వస్తుందా?

Aadavaallu Meeku Joharlu

Aadavaallu Meeku Joharlu: సినిమా హిట్ ఫార్ములా పట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు శర్వానంద్. వరుసగా హిట్ సినిమాలతో దూసుకెళ్తోంది రష్మిక. ఈ ఇద్దరూ కలసి సినిమా చేస్తారని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా వచ్చి రష్మిక, శర్వానంద్ జోడి కుదిర్చింది. ఈ సినిమాతో అయినా శర్వానంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా అని ఆసక్తిగా చూస్తున్నారు ఆడియన్స్.

Tees Maar Khan: పాప ఆగవే.. ఆగి చూడవే.. టీజ్ చేస్తున్న ఆది!

మాస్ సక్సెస్ కోసం చూస్తున్న శర్వానంద్ లేటెస్ట్ సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. రష్మికా మందన్న గ్లామర్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, కిషోర్ తిరుమల డైరెక్షన్ ఇన్ని ప్లస్ లు కలిస్తే శర్వానంద్ కోరుకున్న సక్సెస్ రాకుండా ఉంటుందా? ఈ సారి ఖచ్చితంగా శర్వానంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కతాడనుకుంటున్నారు సినీ అభిమానులు. అన్నీ హీరో ఓరియెంటెడ్ సినిమాలొస్తున్న టైమ్ లో ఆడవాళ్లకు ప్రయారిటీనిస్తూ వచ్చే సినిమా కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనే ధీమాతో ఉన్నాడు శర్వానంద్. ఆల్రెడీ రిలీజ్ అయిన ప్రమోషనల్ వీడియోస్ కి మంచి స్పందనే వస్తోంది.

NTR 30: ఔను నిజమే.. ఎన్టీఆర్ సినిమాపై అలియా క్లారిటీ!

ఎంత టాలెంట్ ఉన్నా ఎంతో కొంత అదృష్టం కూడా ఉంటేనే కెరీర్ లో సక్సెస్ అవుతారని అంటుంటారు. శర్వానంద్ ను చూస్తే అది కరెక్టే అనిపిస్తుంది. 2017లో వచ్చిన శతమానం భవతి, మహానుభావుడు సినిమాలిచ్చిన సక్సెస్ తో శ్రీకారం, రాధ, రణరంగం, జాను, మహాసముద్రం ఇలా వరుస సినిమాలు చేశాడు శర్వానంద్. సినిమా సినిమాకు ప్రత్యేకతను చాటుకోవాలని డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ లు చూజ్ చేసుకున్నాడు. అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటి దాకా ఒక్క సినిమా కూడా ఆయనకు మాస్ సక్సెస్ ను ఇవ్వలేకపోయింది. చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న శ్రీకారం, మహా సముద్రం సినిమాలు కూడా నిరాశనే మిగిల్చాయి.

భీష్మ, సరిలేరు నీకెవ్వరు, పుష్ప ఇలా గ్రాండ్ సక్సెస్ ఫుల్ సినిమాలతో టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లో సైతం అవకాశాలను అందిపుచ్చుకుంటున్న రష్మిక, ఫ్లాప్ లో ఉన్న శర్వానంద్ తో సినిమా చేసిందంటే ఈ సినమాలో ఏదో బలమైన సక్సెస్ ఫుల్ ఎలిమెంట్ ఉండే ఉంటుంది. ఈ సినిమాతో శర్వానంద్ స్టార్ తిరిగిపోవడం పక్కా అనుకునే వాళ్లూ ఉన్నారు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో రష్మిక నటించడంతో ఈ సారైనా అదృష్టం కలిసొచ్చి శర్వానంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.