Tees Maar Khan: పాప ఆగవే.. ఆగి చూడవే.. టీజ్ చేస్తున్న ఆది!

విలక్షణ నటుడు సాయికుమార్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ కు చాలా కాలంగా సరైన సక్సెస్ లేదు.

Tees Maar Khan: పాప ఆగవే.. ఆగి చూడవే.. టీజ్ చేస్తున్న ఆది!

Tees Maar Khan

Updated On : February 4, 2022 / 3:06 PM IST

Tees Maar Khan: విలక్షణ నటుడు సాయికుమార్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ కు చాలా కాలంగా సరైన సక్సెస్ లేదు. డాన్స్, యాక్షన్, యాక్టింగ్ అన్నిటిలో ఆదికి మంచి మార్కులే పడుతున్న సక్సెస్ మాత్రం దోబూచులాడుతోంది. ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టి తీరాలని తీస్ మార్ ఖాన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతిత్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది.

NTR 30: ఔను నిజమే.. ఎన్టీఆర్ సినిమాపై అలియా క్లారిటీ!

తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తీస్ మార్ ఖాన్ సినిమాలోని ‘పాప ఆగవే’ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చూసి చాలా బాగుందని ‘తీస్ మార్ ఖాన్’ యూనిట్‌ని అభినందించిన ఆయన, ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘పాప ఆగవే’ అంటూ మెలోడియస్ ట్యూన్‌తో సాగిపోతున్న ఈ పాట యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది.

Allu Arjun : ‘పుష్ప’ 50 రోజులు.. 365 కోట్ల కలెక్షన్స్.. తగ్గేదేలే..

ఓ ప్రేమికుడు తన ప్రేయసిపై ఉన్న ఫీలింగ్స్ బయటపెడుతూ ‘వదలనే వదలనే నిన్నే నేను వదలనే’ అంటూ కాస్త టీజ్ చేస్తూ చెప్పిన లైన్స్ యూత్ ను ఆకట్టుకుంటున్నాయి. భాస్కర భట్ల లిరిక్స్ ను కారుణ్య ఆలపించగా సాయి కార్తీక్ అందించారు. ఈ సినిమాలో ఆది సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ ఈ పాటలో అలాగే సినిమాలో కూడా హైలైట్ కానున్నాయని యూనిట్ ధీమాగా చెప్తుంది.