Allu Arjun : ‘పుష్ప’ 50 రోజులు.. 365 కోట్ల కలెక్షన్స్.. తగ్గేదేలే..

తాజాగా 'పుష్ప' సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇటీవల కాలంలో థియేటర్స్ లో అఖండ తర్వాత 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమా 'పుష్ప' మాత్రమే. 'పుష్ప' సినిమాకి తెలుగులో.........

Allu Arjun :  ‘పుష్ప’ 50 రోజులు.. 365 కోట్ల కలెక్షన్స్.. తగ్గేదేలే..

Allu Arjun

Pushpa :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ తెరకెక్కించిన సినిమా ‘పుష్ప’. పుష్ప మొదటి పార్ట్ డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. థియేటర్స్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. బాలీవుడ్ లో కూడా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. సినిమా రిలీజ్ అయినా కొన్ని రోజులకే అమెజాన్ ఓటీటీలో రిలీజ్ అయినా థియేటర్స్ లో మాత్రం సందడి తగ్గలేదు. బాలీవుడ్ లో అయితే రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి.

తాజాగా ‘పుష్ప’ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇటీవల కాలంలో థియేటర్స్ లో అఖండ తర్వాత 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమా ‘పుష్ప’ మాత్రమే. ‘పుష్ప’ సినిమాకి తెలుగులో కంటే హిందీలో ఎక్కువగా సక్సెస్ లభించింది. హిందీ ప్రేక్షకులు బన్నీ నటనకి ఫిదా అయిపోతున్నారు. ఇక ఈ సినిమాలోని సాంగ్స్, డైలాగ్స్ ని రీల్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే హిందీలో ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసింది.

Kangana Ranaut : రియాల్టీ షో హోస్ట్‌గా మారిన కంగనా.. లాంచింగ్ ఈవెంట్

తాజాగా ఈ సినిమా రిలీజ్ అయి 50 రోజులు పూర్తి అయిన సందర్భంగా మరోసారి ఇప్పటివరకు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ని అనౌన్స్ చేశారు చిత్ర బృందం. ‘పుష్ప’ సినిమా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 365 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఈ కలెక్షన్స్ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక త్వరలోనే ఈ సినిమా పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టనున్నారు.