Mahaan : విక్రమ్ – ధృవ్ విక్రమ్‌ల సినిమా వచ్చేస్తోంది..

చియాన్ విక్రమ్ తన కొడుకు ధృవ్ విక్రమ్‌తో నటిస్తున్న ‘మహాన్’ మూవీ సెన్సార్ కంప్లీట్..

Mahaan : విక్రమ్ – ధృవ్ విక్రమ్‌ల సినిమా వచ్చేస్తోంది..

Mahaan

Mahaan: ‘చియాన్’ విక్రమ్.. ఎంత కష్టమైనా సరే.. సినిమా కోసం పోషించే పాత్ర కోసం హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా తననితాను మలుచుకుంటారు. ‘అపరిచితుడు’, ‘ఐ’, ‘ఇంకొక్కడు’ ఇలా తన కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే క్యారెక్టర్స్‌తో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశారు. మరో డిఫరెంట్ క్యారెక్టర్‌లో ఫస్ట్ టైం తన కొడుకుతో కలిసి నటిస్తున్నారాయన.

Pushpa : ప్రతీ సీన్ చక్కగా చెక్కావయ్యా సుకుమార్.. చిరు అభినందనలు..

విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ ‘అర్జున్ రెడ్డి’ తమిళ్ రీమేక్ ‘వర్మ’ తో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చక్కటి స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటే కోలీవుడ్‌లో స్టార్ హీరోగా సెటిల్ అయిపోతాడనకున్నారు.

 

Chiyaan Vikram

 

ధృవ్ ఇప్పుడు తండ్రి విక్రమ్‌తో కలిసి నటిస్తున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో చియాన్ విక్రమ్, ధృవ్ విక్రమ్ నటిస్తున్న సినిమా ‘మహాన్’. విక్రమ్ 60వ సినిమా ఇది. వాణి భోజన్, సిమ్రాన్, బాబీ సింహా ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు.

Cobra Movie : విక్రమ్ ‘కోబ్రా’ పరిస్థితి ఏంటి?

ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రీసెంట్‌గా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ‘మహాన్’ మంచి యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందని సెన్సార్ టీం అన్నారు. 2 గంటల 33 నిమిషాల నిడివిగల ‘మహాన్’ మూవీకి U/A సర్టిఫికెట్ జారీ చేశారు కోలీవుడ్ సెన్సార్ టీం.

Akhil Akkineni : అయ్యగారి ఐరన్ బాడీ!..