SSMB 28 : మహేష్ సినిమాకి ముహూర్తం ఫిక్స్..

సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో రాబోయే మూడవ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు..

SSMB 28 : మహేష్ సినిమాకి ముహూర్తం ఫిక్స్..

Ssmb 28

SSMB 28: సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా గురించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. మహేష్ నటించబోయే 28వ మూవీకి ముహూర్తం ఫిక్స్ చేశారు. హారికా & హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.

keerthi Suresh : మహేష్ ఫ్యాన్స్‌ని భయపెడుతున్న ‘మహానటి’..

మహేష్ మరదలి రోల్ కోసం మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్‌ని అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఫిబ్రవరి 3న మహేష్-త్రివిక్రమ్ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది. కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత మహేష్ అటెండ్ అయ్యే ఫస్ట్ సినిమా ఫంక్షన్ ఇదే అవుతుంది..

SSMB 28 : సూపర్‌స్టార్ చెల్లెలిగా సాయి పల్లవి? మెగాస్టార్‌కే నో చెప్పింది కదా!

తమ అభిమాన హీరోని చూడాలని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. SSMB 28కి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వస్తున్న మూడవ సినిమా కావడంతో మంచి అంచనాలున్నాయి. సూపర్ స్టార్ ఇమేజ్‌కి తగ్గట్టు సాలిడ్ స్టోరీ రెడీ చేశారట త్రివిక్రమ్.

Samyuktha Menon : మహేష్ పక్కన ‘భీమ్లా నాయక్’ బ్యూటీ