Samyuktha Menon : మహేష్ పక్కన ‘భీమ్లా నాయక్’ బ్యూటీ

సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాలో సంయుక్త మీనన్..

Samyuktha Menon : మహేష్ పక్కన ‘భీమ్లా నాయక్’ బ్యూటీ

Samyuktha Menon: SSMB 28: సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో వచ్చిన ఫస్ట్ మూవీ ‘అతడు’ సూపర్ డూపర్ హిట్ అవడమే కాక, టీవీలోనూ TRP రేటింగ్స్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసింది.

SSMB 28 : సూపర్‌స్టార్ చెల్లెలిగా సాయి పల్లవి? మెగాస్టార్‌కే నో చెప్పింది కదా!

మహేష్ నటించబోయే 28వ సినిమా ఇది.. మహేష్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా షూటింగ్ పోస్ట్ పోన్ చేశారు. మార్చి నుండి స్టార్ట్ చెయ్యబోతున్నారని సమాచారం. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గరినుండి మీడియా అండ్ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి.

SSMB 28 : సూపర్‌స్టార్ స్టైలిష్ లుక్ అదిరిందిగా..

త్రివిక్రమ్ ‘అరవింద సమేత’, ‘అల..వైకుంఠపురములో’ తర్వాత పూజా హెగ్డేను ముచ్చటగా మూడోసారి హీరోయిన్‌గా తీసుకున్నారని తెలుస్తుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే.. మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్‌ని మేకర్స్ అప్రోచ్ అయ్యారట. అది కూడా సెకండ్ హీరోయిన్ రోల్ కోసమట.

Mahesh-Namrata : ‘హ్యాపీ బర్త్‌డే NSG.. నువ్వే నా ఎనర్జీ’.. నమ్రతకి మహేష్ విషెస్..

త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ మూవీకి డైలాగ్స్, స్క్రీన్‌ప్లే రాస్తున్నారు. అందులో పవన్ పక్కన నిత్య మీనన్, రానాకి జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. అమ్మడి పర్ఫార్మెన్స్ నచ్చడంతో త్రివిక్రమ్, మహేష్ సినిమాలో సెకండ్ ఫీమేల్ లీడ్ రోల్ ఆఫర్ చేశారని, సంయుక్త గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.

Gautam : తెలంగాణలోని టాప్-8 స్విమ్మర్లలో మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని..!