Gautam : తెలంగాణలోని టాప్-8 స్విమ్మర్లలో మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని..!

సూపర్‌స్టార్ మహేష్ బాబు - నమ్రత దంపతుల తనయుడు.. లిటిల్ ప్రిన్స్, గౌతమ్ క్రీడారంగంలో సత్తా చాటుతున్నాడు..

Gautam : తెలంగాణలోని టాప్-8 స్విమ్మర్లలో మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని..!

Gautam

Updated On : June 17, 2021 / 3:55 PM IST

Gautam: సూపర్‌స్టార్ మహేష్ బాబు – నమ్రత దంపతుల తనయుడు.. లిటిల్ ప్రిన్స్, గౌతమ్ క్రీడారంగంలో సత్తా చాటుతున్నాడు. తన ఏజ్ గ్రూప్ విభాగంలో తెలంగాణలోని టాప్-8 స్విమ్మర్లలో ఒకడిగా నిలిచాడు. దీని గురించిన వివరాలను నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

‘గౌతమ్.. తల్లిదండ్రులుగా మేం గర్వపడేలా చేస్తున్నాడు. 2018 నుంచి స్విమ్మింగ్‌లో టాలెంట్ చూపిస్తున్నాడు. స్టేట్ లెవల్లో మంచి స్విమ్మర్‌గా ఎదిగాడు’ అంటూ గౌతమ్ స్విమ్ చేస్తున్న వీడియోను Instagramలో షేర్ చేశారు.

వేగానికి సరైన టెక్నిక్‌ యాడ్ చేసి.. స్విమ్మింగ్‌లోని నాలుగు ప్రధాన విభాగాలైన బటర్‌ఫ్లై, బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ట్‌స్ట్రోక్, ఫ్రీస్టయిల్ అంశాల్లో ఎంతో సునాయాసంగా తన టాలెంట్ చూపిస్తున్నుడాని, అయితే, అన్నింట్లోకి గౌతమ్‌కు ఫ్రీస్టయిల్ అంటే ఇష్టమని, 5 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల్లో నిర్విరామంగా ఈదగలడని నమ్రత పోస్ట్‌లో తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)