Mahesh Babu: ఝల్లుమనిపించే కొత్త యాడ్‌లో మహేశ్.. బుర్జ్‌ ఖలీఫాపై నుంచి బైక్‌తో స్టంట్

ఈ కొత్త యాడ్ వీడియోని మహేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మహేష్ దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా టవర్‌ పైనుంచి బైక్‌తో కిందకు వచ్చి ఆగినట్టు చూపిస్తారు. లాస్ట్‌లో......

Mahesh Babu: ఝల్లుమనిపించే కొత్త యాడ్‌లో మహేశ్.. బుర్జ్‌ ఖలీఫాపై నుంచి బైక్‌తో స్టంట్

Mahesh

Mahesh Babu:  మహేష్‌బాబు చాలా ప్రోడక్ట్స్‌కి యాడ్స్ చేస్తూ ఉంటారు. తాజాగా మరో కొత్త యాడ్‌తో జనాల ముందుకి వచ్చారు మహేష్. మౌంటెన్ డ్యూ కూల్‌డ్రింక్ యాడ్‌తో మరోసారి అదరగొట్టారు మహేష్. మహేష్ సినిమా కోసం ఎంత కష్టపడతారో యాడ్స్ కోసం కూడా అంతే కష్టపడతారు. గతంలో థంమ్స్‌అప్ యాడ్‌కి కూడా రిస్కీ షాట్స్ చేశారు. ఇందులో కొన్ని గ్రాఫిక్స్, కొన్ని ఒరిజినల్ కూడా ఉన్నాయి. తాజాగా మరోసారి మౌంటెన్ డ్యూ కోసం కూడా భారీ యాడ్‌ని డిజైన్ చేశారు మేకర్స్.

ఈ కొత్త యాడ్ వీడియోని మహేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మహేష్ దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా టవర్‌ పైనుంచి మౌంటెన్ డ్యూ తాగి బైక్‌తో కిందకు వచ్చి ఆగినట్టు చూపిస్తారు. లాస్ట్‌లో మౌంటెన్‌ డ్యూ డ్రింక్‌ని చూపించి భయం వదులు గెలిచి చూడు అని చెప్తాడు. చాలా భారీగా ఈ యాడ్‌ని చిత్రీకరించారు. అయితే ఇందులో చాలా వరకు గ్రాఫిక్స్‌ని వాడారు మేకర్స్. ఇటీవలే విజయ్ హెవీ యాక్షన్ థంమ్స్‌అప్ యాడ్ రావడంతో ఇప్పుడు మహేష్ మౌంటెన్ డ్యూ కూడా రావడంతో ఈ రెండు వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.

Rana : క్లైమాక్స్ లేని రానా ‘1945’ సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

మొత్తానికి మహేష్‌తో పాటు స్టార్ హీరోలంతా సినిమాలలో చేసే ఫీట్స్ యాడ్స్ కోసం కూడా చేయడానికి రెడీ అవుతున్నారు. యాడ్స్‌లో కూడా సంపాదన బాగా ఉండటంతో చాలా మంది సెలబ్రిటీలు వచ్చిన యాడ్స్‌ని వదులుకోవట్లేదు. గతంలో మౌంటైన్ డ్యూ‌కి అఖిల్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఉన్న యాడ్ చేసిన సంగతి తెలిసిందే.