Rana : క్లైమాక్స్ లేని రానా ‘1945’ సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

నాలుగేళ్ల క్రితం రానా హీరోగా ‘1945’ అనే సినిమాని అనౌన్స్ చేశారు. బ్రిటీష్ పాలన నేపథ్యంలో 1945 సినిమాను తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ గా రెజీనా నటించింది. అయితే ఈ సినిమా దాదాపు...

Rana : క్లైమాక్స్ లేని రానా ‘1945’ సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Rana (1)

1945 Movie :  నాలుగేళ్ల క్రితం రానా హీరోగా ‘1945’ అనే సినిమాని అనౌన్స్ చేశారు. బ్రిటీష్ పాలన నేపథ్యంలో 1945 సినిమాను తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ గా రెజీనా నటించింది. అయితే ఈ సినిమా దాదాపు 90 శాతం పూర్తి అయ్యాక సినిమా డైరెక్టర్ స‌త్యశివతో రానాకి విభేదాలు ఏర్పడ్డాయి. ఇదే కాక మరికొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి రానా తప్పుకున్నాడు. దీంతో ఈ సినిమా ఆగిపోయింది. క్లైమాక్స్‌ చిత్రీకరణ జరగలేదు.

ఇటీవల ఈ సినిమాని రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేసిన టైంలో రానా ఈ సినిమాకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని ట్వీట్ చేశాడు. అయినా 1945 సినిమాని క్లైమాక్ లేకుండానే జనవరి 7న రిలీజ్ చేశారు. సినిమా చూసిన ప్రేక్షకులు క్లైమాక్ లేదు అని, సినిమా అంతా అస్తవ్యస్తంగా ఉందని కామెంట్స్ కూడా చేశారు. తాజాగా ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Rahul Ramakrishna : ఇక సినిమాలు చేయను.. రాహుల్ రామకృష్ణ షాకింగ్ నిర్ణయం 

1945 సినిమాని జనవరి 7న థియేటర్లలో విడుదల చేశారు మేకర్స్‌. కరెక్టుగా నెల రోజుల తర్వాత ఫిబ్రవరి 7న ఓటీటీలో రిలీజ్ అవ్వనుంది. సన్‌ నెక్స్ట్‌ ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. మరి ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులని ఎలా అలరిస్తుందో చూడాలి.