Mahesh Babu: ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్‌ను రెడీ చేస్తోన్న మహేష్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండటంతో వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ విజయం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మహేష్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

Mahesh Babu: ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్‌ను రెడీ చేస్తోన్న మహేష్..?

Mahesh Babu Planning Double Treat For Birthday

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండటంతో వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ విజయం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మహేష్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

Mahesh Babu : జిమ్‌లో మహేష్ కసరత్తులు రాజమౌళి సినిమా కోసమేనా.. వైరల్ అవుతున్న ఫోటోలు!

ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్‌లో భారీ స్థాయిలో రూపొందించనున్నాడు. ఈ సినిమాను ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. మహేష్ చేస్తున్న ప్రస్తుత సినిమా పూర్తవగానే ఈ సినిమాను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే మహేష్ తన అభిమానులకు ఒకేసారి డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బర్త్‌డే కానుకగా త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Mahesh Babu : హాలీవుడ్ రేంజ్ మహేష్ బాబు కొత్త మౌంటెన్ డ్యూ యాడ్..

అటు రాజమౌళితో చేయబోయే సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా అదే రోజున చేయాలని మహేష్ చూస్తున్నాడట. ఇలా తన నెక్ట్స్ బర్త్‌డేకు డబుల్ ట్రీట్‌ను ప్లాన్ చేస్తున్నాడనే వార్తతో మహేష్ అభిమానులు ఆ రోజు కోసం అప్పుడే ఆసక్తిగా చూస్తున్నారు.