Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట.. మరో పోకిరి కానుందా..?

మహేష్ మాస్ స్వాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా....

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట.. మరో పోకిరి కానుందా..?

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: మహేష్ మాస్ స్వాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే మహేష్ మరోసారి బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేందుకు రెడీ అయినట్లుగా కనిపిస్తున్నాడు. అయితే ఈ ట్రైలర్ చూస్తే మనకు గతకొంతకాలంగా కనిపిస్తున్న మహేష్ ఎక్కడా కూడా కనిపించడం లేదు.

Sarkaru Vaari Paata: మెంటల్ మాస్..! సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్.. హైలైట్స్ ఇవే!

ఈ సినిమా ట్రైలర్‌లో మనకు పోకిరి నాటి మహేష్ బాబు స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఇటీవల కాలంలో మహేష్ చాలా సాఫ్ట్‌గా ఉన్న పాత్రల్లోనే ఎక్కువగా నటిస్తూ, డైలాగులు కూడా అదే విధంగా సాఫ్ట్‌గా చెబుతూ వచ్చాడు. కానీ ఒక్కసారిగా ‘సర్కారు వారి పాట’లో పోకిరి పూనకం వచ్చిన మహేష్‌ను చూపించాడు దర్శకుడు పరశురామ్. పోకిరిలో మహేష్ నోటి నుండి మనకు బోలెడన్నీ బోల్డ్ డైలాగ్స్ వినిపించాయి. మళ్లీ ఇంతకాలానికి మహేష్ నోటి నుండి అలాంటి పదాలు వినిపిస్తుండటంతో ఈ సినిమా మరో పోకిరి కావడం ఖాయమని ఆయన అభిమానులు అంటున్నారు.

Sarkaru Vaari Paata: మహేష్ నోట సీఎం జగన్ మాట.. పొలిటికల్ డైలాగ్‌కి లవ్ ఎఫెక్ట్!

మొత్తానికి ఫ్యాన్స్ ఎదురుచూపులు ఊరికేపోలేదని.. ఈ ట్రైలర్‌లోనే చూపెట్టాడు మహేష్. ఇక ఈ సినిమాలో ఆయన లుక్స్ పరంగా స్టైలిష్‌గా ఉన్నా, లోపల మాత్రం ఊరమాస్ అనేట్టుగా మహేష్ పాత్రను డిజైన్ చేశాడు చిత్ర దర్శకుడు. ఏదేమైనా సర్కారు వారి పాట చిత్రం మహేష్ ఫ్యాన్స్ ఆకలిని పూర్తిగా తీర్చేయనుందని, ట్రైలర్‌తోనే చెప్పేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ మరోసారి తన వాయింపుడుతో థియేటర్ల బాక్సులు బద్దలుకొట్టేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను సమ్మర్ ట్రీట్‌గా మే 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మరి నిజంగానే సర్కారు వారి పాట మరో పోకిరి కానుందా అనేది తెలియాలంటే మరో పదిరోజుల పాటు వెయిట్ చేయాల్సిందే.