Mahesh Babu : 17 సంవత్సరాలు.. ఇదంతా ప్రేమతోనే.. మహేష్ పెళ్లిరోజు స్పెషల్ పోస్ట్..

మహేష్ ది లవ్ మ్యారేజ్ అని అందరికి తెలిసిందే. మహేష్, నమ్రతా శిరోద్కర్ టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు. వీరి జంటకి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇవాళ వీరి పెళ్లి రోజు........

Mahesh Babu :  17 సంవత్సరాలు.. ఇదంతా ప్రేమతోనే.. మహేష్ పెళ్లిరోజు స్పెషల్ పోస్ట్..

Mahesh Babu

Mahesh Babu :   మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. మహేష్ సినిమాలతో పాటు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తారని మనకి తెలిసిందే. సంవత్సరంలో రెండు లేదా మూడు సార్లు అయినా మహేష్ ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్స్ వేస్తూ ఉంటాడు. ఖాళీగా ఉన్నప్పుడు తన ఫ్యామిలీతోనే గడపటానికి ఎక్కువ ఇష్టపడతాడు మహేష్. తన సోషల్ మీడియాలో కూడా తన కూతురు, తనయుడు, భార్యతో కలిసి ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ ఉంటాడు.

మహేష్ ది లవ్ మ్యారేజ్ అని అందరికి తెలిసిందే. మహేష్, నమ్రతా శిరోద్కర్ టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు. వీరి జంటకి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇవాళ వీరి పెళ్లి రోజు కావడంతో మహేష్ తన ఫ్యామిలీతో ఉన్న ఫోటోని షేర్ చేసి స్పెషల్ పోస్ట్ చేశారు. తన ఫ్యామిలీతో ఉన్న ఫోటోని షేర్ చేసి.. ”అప్పుడే 17 సంవత్సరాలు అయిపోయింది. హ్యాపీ యానివర్సరీ. ఇలాంటివి మరిన్ని జరుపుకోవాలి. ఇదంతా ప్రేమతో” అని విష్ చేశారు. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మహేష్ జంటకి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Sumanth : రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి ఇదే చూస్తున్నాం.. పవన్, జగన్ పై మాట్లాడిన సుమంత్..

అటు నమ్రతా కూడా మహేష్ తో ఉన్న పాత ఫొటోలతో వీడియో చేసి షేర్ చేసింది. ఆ వీడియో షేర్ చేసి.. ”మా ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది. మా ప్రేమలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఇది జీవితాంతం ఉంటుంది.” అంటూ మహేష్ కి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేసింది.