Sumanth : రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి ఇదే చూస్తున్నాం.. పవన్, జగన్ పై మాట్లాడిన సుమంత్..

ఏపీ సీఎం జగన్, హీరో సుమంత్ ఇద్దరూ చిన్నప్పటి ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. సుమంత్ ఏపీ రాజకీయాలపై, జగన్, పవన్ కళ్యాణ్ లపై కూడా వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో సుమంత్ మాట్లాడుతూ....

Sumanth :  రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి ఇదే చూస్తున్నాం.. పవన్, జగన్ పై మాట్లాడిన సుమంత్..

Sumanth (1)

Sumanth :  హీరో సుమంత్‌ తాజాగా నటించిన చిత్రం ‘మళ్లీ ముదలైంది’ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఫిబ్రవరి 11న రిలీజ్‌ అవ్వనుంది. నిన్న సుమంత్ బర్త్ డే కూడా కావడంతో ఈ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో సుమంత్‌ అనేక ఆసక్తికర విషయాలని తెలిపారు.

ఏపీ సీఎం జగన్, హీరో సుమంత్ ఇద్దరూ చిన్నప్పటి ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. సుమంత్ ఏపీ రాజకీయాలపై, జగన్, పవన్ కళ్యాణ్ లపై కూడా వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో సుమంత్ మాట్లాడుతూ.. ”జగన్ గొప్ప పొజిషన్ కి చేరుకుంటాడని చిన్నప్పటినుంచే నాకు తెలుసు. జగన్ అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. రాజకీయాలపై నాకు అవగాహన లేదు. కానీ అప్పుడప్పుడూ ఏం జరుగుతుందో వింటాను, తెలుసుకుంటాను.” అని అన్నారు.

Mahesh Babu : ‘సర్కారు వారి పాట’లో మహేష్ చిన్నప్పటి క్యారెక్టర్.. ఈ హీరో తనయుడే..

అయితే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గురించి అడగగా.. ”జగన్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. వారిద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియదు. క్లారిటీ లేకుండా ఇలాంటివి నేను అస్సలు మాట్లాడను. కానీ రెండు పార్టీల మధ్య, నాయకుల మధ్య మాత్రం విభేదాలు ఉండడం సహజమే కదా. రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి అందరం ఇదే చూస్తున్నాం కదా” అని సుమంత్ అన్నారు.