Mahesh Babu : ‘సర్కారు వారి పాట’లో మహేష్ చిన్నప్పటి క్యారెక్టర్.. ఈ హీరో తనయుడే..

సుధీర్ బాబు మాట్లాడుతూ.. ''కెరీర్ పరంగా నేనెప్పుడూ మహేష్ ని, కృష్ణ గారిని సహాయం అడగలేదు. వారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను సినిమాల్లో కష్టపడటం వారి దగ్గర నుంచే............

Mahesh Babu :  ‘సర్కారు వారి పాట’లో మహేష్ చిన్నప్పటి క్యారెక్టర్.. ఈ హీరో తనయుడే..

Sudheer Babu (1)

Sarkaru Vaari Paata :  ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని మేలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ వీక్ ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి లవ్ సాంగ్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. మహేష్ బావ, హీరో సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నిన్న మీడియాతో మాట్లాడారు. ఈ మీటింగ్ లో చాలా ఆసక్తికర విషయాలని తెలియచేశాడు.

Sarayu : సారీ చెప్పిన 7 ఆర్ట్స్ సరయు..

సుధీర్ బాబు మాట్లాడుతూ.. ”కెరీర్ పరంగా నేనెప్పుడూ మహేష్ ని, కృష్ణ గారిని సహాయం అడగలేదు. వారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను సినిమాల్లో కష్టపడటం వారి దగ్గర నుంచే నేర్చుకున్నాను. నా ఇద్దరు కుమారులు చరిత్, దర్శన్‌ లు కూడా సినిమాల పట్లే ఆసక్తిగానే ఉన్నారు. హర్షవర్ధన్‌ దర్శకత్వంలో ప్రస్తుతం నేను చేస్తోన్న ఓ సినిమాలో చరిత్‌ నా చిన్ననాటి క్యారెక్టర్‌ చేశాడు. ప్రస్తుతం మహేశ్‌ బాబు నటిస్తున్న ‘సర్కారువారి పాట’ సినిమాలో జూనియర్‌ మహేశ్‌గా దర్శన్‌ కనిపించబోతున్నాడు” అని తెలిపాడు.

 

దీంతో ‘సర్కారు వారి పాట’ సినిమాలో సుధీర్ తనయుడు దర్శన్ జూనియర్ మహేష్ గా కనిపించబోతున్నాడు. అంటే సర్కారు వారి పాట సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉండబోతున్నాయి, సినిమాలో మహేష్ క్యారెక్టర్ చిన్నప్పటి పరిస్థితులని కూడా చూపించబోతున్నట్టు తెలుస్తుంది.