Sarayu : సారీ చెప్పిన 7 ఆర్ట్స్ సరయు..

సరయు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను గతంలో గిప్పనిస్తా అనే ఓ షార్ట్‌ ఫిలింలో నేను నటించాను. అందులో 7 ఆర్ట్స్‌కు సిరిసిల్లలో ఒక బిర్యానీ ఫ్రాంచైజీ ఓపెన్‌ అయింది......

Sarayu :  సారీ చెప్పిన 7 ఆర్ట్స్ సరయు..

Sarayu

Sarayu :  బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్, ‘7ఆర్ట్స్‌’ సరయుపై గతంలో సిరిసిల్లలో కేసు నమోదు అవ్వగా అది ఇటీవల బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌ కి ట్రాన్స్ఫర్ అయింది. బంజారాహిల్స్ పోలీసులు సరయుని అదుపులోకి తీసుకొని విచారించిన సంగతి తెలిసిందే. సరయుని, ఆమె టీమ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్‌ చేసి విచారించారు. ఈ కేసు ఇంకా నడుస్తుంది. తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది సరయు. ఈ ఇంటర్వ్యూలో ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ అందరికి క్షమాపణలు చెప్పింది.

 

సరయు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను గతంలో గిప్పనిస్తా అనే ఓ షార్ట్‌ ఫిలింలో నేను నటించాను. అందులో 7 ఆర్ట్స్‌కు సిరిసిల్లలో ఒక బిర్యానీ ఫ్రాంచైజీ ఓపెన్‌ అయింది. ఈ ప్రమోషన్‌లో గణపతి బప్పా రిబ్బన్‌ కట్టుకుని మందు తాగాం. మేము ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి అలా చేయలేదు. విజయ్‌ సేతుపతి సినిమాలో నుంచి ఒక సీన్‌ను రిఫరెన్స్‌గా తీసుకొని అలా చేశాం. కానీ సిరిసిల్లలో విశ్వ హిందూ పరిషత్‌ వాళ్లకు అది నచ్చలేదు. అప్పుడు సిరిసిల్లలోనే కేసు నమోదు అయింది. ఇందులో సీన్‌ మా మనోభావాలను కించపరిచేలా ఉందని అభ్యంతరం చెప్పడంతో ఆ సీన్‌ తీసేశాం. తర్వాత సిరిసిల్లలో బిర్యానీ పాయింట్‌ ఓపెన్‌ చేశాం.

Mehaboob Dilse : బిగ్‌బాస్ మెహబూబ్ కొత్త ఇల్లు హోమ్ టూర్..

అంతా అయిపోయిందని అనుకున్నాము. కానీ ఏడాది తర్వాత ఆ కేసును బంజారాహిల్స్‌కు బదిలీ చేశారు. పోలీసులు పిలిస్తే ఎంక్వైరీ కోసం కూడా వెళ్లివచ్చాం. మమ్మల్ని కాంటాక్ట్‌ చేయడానికి ప్రయత్నించామంటున్నారు కానీ అది జరగలేదు. ఒక నటిగా దర్శకుడు ఏది చెప్తే నేను అది చేస్తాను. నేనూ ఒక హిందువునే, నాది హిందూ కుటుంబమే. నా మతం గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను కూడా సహించను. ఒక హిందూ అమ్మాయిగా హిందువుల మనోభావాలను కించపరచను. మీ మనోభావాలు దెబ్బ తినుంటే సారీ” అని అందరికి క్షమాపణలు చెప్పింది సరయు.