S.Thaman: మహేష్, ప్రభాస్ మల్టీస్టారర్.. తమన్ ట్వీట్ వైరల్!

సోషల్ మీడియా అంటేనే మాయలోకం అనాలేమో. ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో.. అసలు నిజమేంటో.. అబద్దమేంటో.. పొరపాటున జరిగిందేంటో.. కావాలని చేసింది ఏంటో తెలిసేలోపే లోకం చుట్టేసేంతగా వైరల్..

S.Thaman: మహేష్, ప్రభాస్ మల్టీస్టారర్.. తమన్ ట్వీట్ వైరల్!

S.thaman

S.Thaman: సోషల్ మీడియా అంటేనే మాయలోకం అనాలేమో. ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో.. అసలు నిజమేంటో.. అబద్దమేంటో.. పొరపాటున జరిగిందేంటో.. కావాలని చేసింది ఏంటో తెలిసేలోపే లోకం చుట్టేసేంతగా వైరల్ అవుతుంది. పాపం తమన్ విషయంలో కూడా అదే జరిగింది. ఈ మధ్య సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో నెటిజన్లతో ఇంటరాక్ట్ సెషన్స్ నడుపుతున్నారు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా అలానే ట్విట్టర్ ఖాతా నుండి చాట్ సెషన్ నిర్వహించాడు.

Bigg Boss 5: ప్రోమో వేరే.. ఎపిసోడ్ వేరే.. అయ్యో పిచ్చోళ్ళని చేశారే!

అయితే, మహేష్ అభిమాని అయిన ఓ నెటిజన్ మహేష్ 28వ ప్రాజెక్ట్ గురించి అడిగాడు. త్రివిక్రమ్ దర్శత్వంలో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. దానికి సమాధానం చెప్పిన తమన్.. త్వరలోనే ప్రభాస్ అన్నతో వస్తా అని సమాధానం ఇచ్చి మహేష్ అభిమాని ఇచ్చిన ప్రశ్నని ట్యాగ్ చేశాడు. దీంతో మహేష్-త్రివిక్రమ్ సినిమాలో ప్రభాస్ కూడా ఉండనున్నాడని అర్ధం చేసుకున్న ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేశారు.

Samantha: లైఫ్ గురించి సామ్ చెప్పిన కొత్త నిర్వచనం.. పోస్ట్ వైరల్!

తమన్ అది తప్పుగా ఇచ్చిన సమాధానమని గుర్తించి ఆ ట్వీట్ డిలీట్ చేశాడు. కానీ, అప్పటికే ఈ ట్వీట్ ఫన్నీ వైరల్ గా మారిపోయింది. ఇలా పొరపాటున తమన్ చెప్పినా.. మహేష్, ప్రభాస్ కాంబినేషన్ మల్టీస్టారర్ గురించి సోషల్ మీడియాలో చర్చ మాత్రం పీక్స్ కి చేరింది. కొందరు ఇప్పటికే దీనిపై పోస్టర్లు కూడా ఎడిట్ చేసి రచ్చ చేస్తుంటే.. ఒక్కసారి ఈ కాంబినేషన్ సెట్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండని కొందరు అభిమానులు ఊరించేస్తున్నారు.