Bigg Boss 5: ప్రోమో వేరే.. ఎపిసోడ్ వేరే.. అయ్యో పిచ్చోళ్ళని చేశారే!

బిగ్ బాస్ ఒక్కోసారి ప్రేక్షకులను పిచ్చోళ్ళని చేసి అయినా ఆకట్టుకోవాలని డిసైడ్ అయినట్లున్నాడు. అందుకే ఉన్న దానిలో ఇంకేదో ఉన్నట్లుగా చూపించి ఆసక్తి పెంచే కార్యక్రమానికి శ్రీకారం..

Bigg Boss 5: ప్రోమో వేరే.. ఎపిసోడ్ వేరే.. అయ్యో పిచ్చోళ్ళని చేశారే!

Bigg Boss 5 (1)

Bigg Boss 5: బిగ్ బాస్ ఒక్కోసారి ప్రేక్షకులను పిచ్చోళ్ళని చేసి అయినా ఆకట్టుకోవాలని డిసైడ్ అయినట్లున్నాడు. అందుకే ఉన్న దానిలో ఇంకేదో ఉన్నట్లుగా చూపించి ఆసక్తి పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. షో క్రియేటివ్ టీమ్ ఈసారి వాళ్ళ మెదళ్లకి పదును పెట్టి అందంగా వండి వార్చి ఫైనల్ గా ప్రేక్షకులను పిచ్చోళ్ళని చేశారు. సహజంగా ఏ రోజు ఎపిసోడ్ గురించి ఆ రోజు ఉదయం నుండి ప్రోమోలు విడుదల చేసి రాత్రికి ప్రసారమయ్యే ఎపిసోడ్ మీద ఆసక్తి పెంచుతుంటారు.

Bigg Boss 5: శ్రీరామ్‌కు సోనూ సపోర్ట్.. టైటిల్ కొట్టడం ఖాయమా?

బుధవారం నాటి ఎపిసోడ్ గురించి కూడా ఉదయం నుండే ప్రోమోలు ప్రసారమయ్యాయి. అయితే, ఇందులో క్రియేటివిటీ మరీ కాస్త ఎక్కువైంది. జెస్సీకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో బిగ్ బాస్ కన్ఫెషన్ రూంకి పిలిచి వివరాలు అడిగాడు. జెస్సీ నిజమే తనకు ఆరోగ్యం సహకరించడం లేదని ఒప్పుకున్నాడు. దీంతో బిగ్ బాస్ జెస్సీని లగేజ్ సర్దుకొని ఇంటి సభ్యులకు వీడ్కోలు చెప్పేసి బయటకి వచ్చేయమన్నాడు. దీంతో జెస్సీ కూడా నిజమే అనుకోని బిగ్ బాస్ చెప్పినట్లు ఇంటి నుండి బయటకి వచ్చేశాడు.

Bigg Boss 5: వైవిధ్యంగా సాగిన నామినేషన్స్.. ఈ వారం లిస్ట్‌లో ఐదుగురు!

జెస్సీ అర్ధాంతరంగా ఇంటి నుండి బయటకి వచ్చేయడంతో ఇంటి సభ్యులు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. కన్నీటితో జెస్సీకి ఇంటి నుండి వీడ్కోలు పలికారు. ఇదంతా ఉదయం నుండి ప్రోమోల్లో హల్చల్ చేయడంతో అందరూ ఎపిసోడ్ కోసం తహతహ లాడారు. సాయంత్రం ఎపిసోడ్ లో మాత్రం జెస్సీ మెయిన్ గేట్ నుండి బయటకి వచ్చే వరకే ఇంటి నుండి వెళ్తున్నారని అనుకున్నారు. కానీ, చివరికి జెస్సీని సీక్రెట్ రూమ్ లోనే కొద్దీ రోజులు ఉండాలని ఆదేశించడంతో బిగ్ బాస్ ప్రేక్షకులకు బుర్ర గిర్రున తిరిగిపోయింది.

Bigg Boss 5: వచ్చేవారం ఇంట్లో కొత్త కంటెస్టెంట్లు.. ఇప్పుడు వైల్డ్ ఎంట్రీ ఏంటి?!

జెస్సీని మళ్ళీ కొద్దిరోజుల్లో ఇంటిలో పంపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఆరోగ్య కారణాలతో ఇతర కంటెస్టెంట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా సీక్రెట్ లోకి పంపాడు. అయితే, దాన్ని తన ప్రచారానికి అనుగుణంగా షో క్రియేటివ్ టీం భారీ ఎమోషనల్ బిల్డప్ ఇచ్చి వాడేసుకుంది. కానీ, ప్రోమో చూసి జెస్సీ ఇంటి నుండి బయటకి వెళ్తాడని అనుకున్న ప్రేక్షకులకు షోలో అది నిజం కాదని తెలిసి అవాక్కయ్యారు. బిగ్ బాస్ అంటేనే ఎమోషనల్ ఫీలింగ్స్ తో ఆడే అటకదా ఇది షరామామూలే అంటారా.. పాపం పిచ్చి ప్రేక్షకులకు అది తెలియదాయె!