Bigg Boss 5: వచ్చేవారం ఇంట్లో కొత్త కంటెస్టెంట్లు.. ఇప్పుడు వైల్డ్ ఎంట్రీ ఏంటి?!

బిగ్ బాస్ ఐదవ సీజన్ మొదలై 9 వారాలు గడిచిపోగా 19 మందితో మొదలైన సీజన్ లో ఇప్పుడు తొమ్మిది మంది ఉన్నారు. ఈ ఆదివారం మరొకరు బయటకి రానున్నారు. ఇప్పటికే ఈ వారం ఎలిమినేట్ అయ్యే..

Bigg Boss 5: వచ్చేవారం ఇంట్లో కొత్త కంటెస్టెంట్లు.. ఇప్పుడు వైల్డ్ ఎంట్రీ ఏంటి?!

Bigg Boss 5

Bigg Boss 5: బిగ్ బాస్ ఐదవ సీజన్ మొదలై 9 వారాలు గడిచిపోగా 19 మందితో మొదలైన సీజన్ లో ఇప్పుడు తొమ్మిది మంది ఉన్నారు. ఈ ఆదివారం మరొకరు బయటకి రానున్నారు. ఇప్పటికే ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ విశ్వ అనేది లీకైపోయింది. ఇక విశ్వ బయటకి రావడమే బ్యాలెన్స్. కాగా, మిగిలిన పదిమందితో వచ్చే రోజులు ఎలా అన్నదానిపై బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే ప్లాన్స్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. వచ్చేవారం బిగ్ బాస్ ఇంట్లో కొత్త కంటెస్టెంట్ ఉండనున్నారని బలంగా ప్రచారం జరుగుతుంది.

Bigg Boss 5: ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ గెట్ టూ గెదర్.. ఎక్కడంటే?

ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎప్పుడన్నది చాలా కాలంగా చర్చలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన నాలుగు సీజనల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండగా అది షోకు కూడా బాగానే ఉపయోగపడింది. అయితే.. ఇప్పుడు తొమ్మిది వారాలు పూర్తయినా ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పంపలేదు. కానీ.. వచ్చేవారం ఈ టైం వచ్చినట్లు తెలుస్తుంది. ఒకరు లేక ఇద్దరు కంటెస్టెంట్లను ఒకేసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేందుకు షో నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

Bigg Boss 5: నా పుట్టలో వేలు పెడితే నేను పెట్టనా.. కాజల్ VS శ్రీరామ్!

ఇప్పటికే ఒక లేడీ కంటెస్టెంట్ క్వారైటైన్ లో ఉన్నట్లు తెలుస్తుండగా మరొకరి మేల్ కంటెస్టెంట్ గా చెప్పుకుంటున్నారు. అయితే.. అసలు దాదాపు షో చివరి దశకు వస్తుండగా ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏంటనే విమర్శలు కూడా మరోవైపు వినిపిస్తున్నాయి. అసలు తొలి వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటేనే అప్పటికే ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ కొత్తగా వచ్చినా వారిపై విరుచుకుపడుతుంటారు. ప్రేక్షకులలో కూడా అనుకున్న స్థాయి ఆదరణ వారికి దక్కదు. అయితే.. షో మాత్రం ఆసక్తిగా మారుతుంది. అందుకే షో నిర్వాహకులు ఇప్పుడు ఈ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.