Bigg Boss 5: నా పుట్టలో వేలు పెడితే నేను పెట్టనా.. కాజల్ VS శ్రీరామ్!

9వ వారం నామినేషన్స్‌ సందర్భంగా బిగ్ బాస్ ఇంట్లో కాజల్, శ్రీరామ్ మధ్య మాటల యుద్ధమే నడించింది. యాంకర్ రవి, సింగర్ శ్రీరామచంద్రని నామినేట్ చేసిన కాజల్ సరైన రీజన్ చెప్పడంలో మాత్రం..

Bigg Boss 5: నా పుట్టలో వేలు పెడితే నేను పెట్టనా.. కాజల్ VS శ్రీరామ్!

Bigg Boss 5

Updated On : November 2, 2021 / 10:29 AM IST

Bigg Boss 5: 9వ వారం నామినేషన్స్‌ సందర్భంగా బిగ్ బాస్ ఇంట్లో కాజల్, శ్రీరామ్ మధ్య మాటల యుద్ధమే నడించింది. యాంకర్ రవి, సింగర్ శ్రీరామచంద్రని నామినేట్ చేసిన కాజల్ సరైన రీజన్ చెప్పడంలో మాత్రం విఫలం అయ్యింది. నీతో ఎంత మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నా కూడా నువ్వు నాతో కలవడం లేదు అని శ్రీరామచంద్రని అడిగినప్పుడు అతను సరైన సమాధానం ఇచ్చాడు. మన ఇద్దరం ముందే మాట్లాడుకున్నాం కదా ఏలాంటి బాండింగ్ ఉండకూడదు అని కేవలం హౌస్ మేట్స్ మాత్రమే అని చెప్పావని కాజల్ అన్న మాటలనే శ్రీరామ్ ఆన్సర్ ఇచ్చాడు.

Bigg Boss 5: షణ్ముఖ్ తప్ప మిగతా పది మంది నామినేట్!

నిజానికి కాజల్ అంటే స్ట్రాటజీ.. స్ట్రాటజీ అంటే కాజల్ అనే తరహాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అంటే అంతలా కంటెస్టెంట్లను బట్టి గేమ్ ఆడుతూ హౌస్ లో నిలబడుతుంది. వీలైనంత వరకు ఆమె సేఫ్ గేమ్ ఆడుతుందని టాక్ నడుస్తుంది. దాన్ని గమనించిన శ్రీరామ్ అందుకు తగ్గట్లే ఆమె మాటల్లోనే ఆన్సర్ చెప్పాడు. కాజల్ కు ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడాలి.. కోపం వచ్చినప్పుడు మాట్లాడకూడదు. నీకు ఉన్న ఆలోచన విధానాన్ని బట్టే నేను ఉన్నానని శ్రీరామ్ ఆన్సర్ చెప్పాడు.

Shah Rukh Khan: విద్యుత్ దీపాలతో జిగేల్ మనిపిస్తున్న షారుఖ్ మన్నత్!

అయినా.. కాజల్ అతని ఫేస్ పై క్రీమ్ పోసి నామినేట్ చేసింది. దీంతో నా పుట్టలో వేలు పెట్టాలని అనుకున్నావు తప్పకుండా నేను కూడా నీ పుట్టలో వేలు పెడతాను అంటూ శ్రీరామ్ మరో కౌంటర్ ఇచ్చాడు. ఈ పుట్టలో వేలుపెడతా అనే డైలాగ్ మొదట్లో సరయు ఉపయోగిస్తే ఆ తర్వాత కాజల్ పలుమార్లు వాడింది. ఇప్పుడు శ్రీరామ్ కూడా అదే మాటతో కాజల్ ను ఆన్సర్ చెప్పాడు. ఈ మాటలతో పాటు కాజల్ గేమ్, స్ట్రాటజీని శ్రీరామ్ ఓపెన్ గా ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చెప్పేయడంతో కాజల్ ప్రేక్షకుల దృష్టిలో ఇప్పుడు కన్నింగ్ అనే ముద్ర పడుతుంటే ఇక ఎవరికి వారు ఈ వారం ఎలిమినేషన్ నుండి బయటపడతామా లేదా అన్న టెన్షన్ తో ఈ వారం మొదలు పెట్టారు.