Bigg Boss 5: షణ్ముఖ్ తప్ప మిగతా పది మంది నామినేట్!
బిగ్ బాస్ హౌస్ లో 8వవారం దీపావళి ధమాకా ఎపిసోడ్ ఫుల్ బిందాస్ గా జరిగింది. ఒకవిధంగా సెలబ్రిటీల మారథాన్ నిర్వహించారు బిగ్ బాస్ టీం. ఆ తర్వాత లోబో ఎలిమినేట్ అయి హౌస్ నుంచీ బయటకి..

Bigg Boss 5
Bigg Boss 5: బిగ్ బాస్ హౌస్ లో 8వవారం దీపావళి ధమాకా ఎపిసోడ్ ఫుల్ బిందాస్ గా జరిగింది. ఒకవిధంగా సెలబ్రిటీల మారథాన్ నిర్వహించారు బిగ్ బాస్ టీం. ఆ తర్వాత లోబో ఎలిమినేట్ అయి హౌస్ నుంచీ బయటకి వచ్చేశాడు. అలా ఎంటర్ టైన్మెంట్ అలా ఉండగానే హౌస్ లో 9వ వారం నామినేషన్స్ రచ్చ స్టార్ట్ అయ్యింది. ఒకరి ముఖంపై ఒకరు ఫోమ్ ని పూసి మరీ ఓపెన్ నామినేషన్స్ చేసుకున్నారు. ఇప్పటి వరకు నామినేషన్స్ లో గేమ్స్.. లేకపోతే సీక్రెట్ నామినేషన్ ఉండేది.
Big Boss 5: అర్ధరాత్రి మానస్ దుప్పట్లో పింకీ.. బీబీ హౌస్‌లో మూడుముక్కలాట!
కానీ, ఈసారి ఓపెన్ నామినేషన్ పెట్టడంతో కంటెస్టెంట్లు మధ్య వార్ నడిచింది. ఒక్కో సభ్యుడు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉండడం.. అందుకు తగిన రీసన్స్ చెప్పడం మాటల యుద్దానికి దారితీసింది. ముందుగా మానస్.. శ్రీరామ్, జెస్సీలను నామినేట్ చేయగా.. సిరి.. సన్నీ, ఆనీ మాస్టర్‌లను, శ్రీరామ్.. సన్నీ, మానస్‌లను, షణ్ముఖ్.. మానస్, ప్రియాంకలను నామినేట్ చేశాడు. కాజల్‌ని రవి నామినేట్ చేస్తే, జెస్సీ.. సన్నీ, మానస్‌లను, ప్రియాంక.. విశ్వ, రవిలను నామినేట్ చేసింది.
Big Boss 5: ఫాఫం.. ఉన్న ఒక్క జంటను విడగొట్టేశారే!
అలా 9వ వారం నామినేషన్స్‌లో.. మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, ఆనీ మాస్టర్, విశ్వ ఈ పది మంది నామినేట్ అవగా కెప్టెన్ షణ్ముఖ్ ఒక్కడికే మినహాయింపు దక్కింది. నామినేషన్స్ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య మాటల యుద్ధం నడించింది. శ్రీరామ్, మానస్‌కి మధ్య చాలాసేపు డిస్కషన్ జరగగా.. విశ్వ, రవిలను నామినేట్ చేసిన ప్రియాంకా.. మీరు చాలా స్ట్రాంగ్.. ఫిజికల్ టాస్క్‌లో మీరుంటే నేను ఓటమికి గురౌతాననే చెప్పడం హీట్ పెంచింది. ఇక అదే సమయంలో రవి నీ అన్నయ్యను చెప్తున్నానని ఎన్ని చెప్పినా ప్రియాంకా రవి మొహం మీద ఫామ్ పూసేసింది.