Shah Rukh Khan: విద్యుత్ దీపాలతో జిగేల్ మనిపిస్తున్న షారుఖ్ మన్నత్!

దసరా, దీపావళి, క్రిస్టమస్, రంజాన్ ఇలా అన్ని పండగలతో పాటు ఇంటి సభ్యుల పుట్టినరోజులు నాటి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఇల్లు మన్నత్ విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది. అయితే.. ఈ ఏడాది..

Shah Rukh Khan: విద్యుత్ దీపాలతో జిగేల్ మనిపిస్తున్న షారుఖ్ మన్నత్!

Shah Rukh Khan

Shah Rukh Khan: దసరా, దీపావళి, క్రిస్టమస్, రంజాన్ ఇలా అన్ని పండగలతో పాటు ఇంటి సభ్యుల పుట్టినరోజులు నాటి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఇల్లు మన్నత్ విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది. అయితే.. ఈ ఏడాది దసరా పండగతో పాటు షారుఖ్ భార్య గౌరీఖాన్ పుట్టినరోజులలో మన్నత్ వద్ద ఎలాంటి సందడి లేకుండాపోయింది. ఈ సమయంలో షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో జైల్లో ఉన్నాడు. అందుకే ఎలాంటి సెలబ్రేషన్స్ జరుపుకోలేదు.

Janhvi Kapoor: జాన్వీ, సారా ఆథ్యాత్మిక యాత్ర.. ఇంతలో అంత మార్పా?

అయితే, ఇప్పుడు ఆర్యన్ కు బెయిల్ రావడంతో జైలు నుండి బయటపడ్డాడు. దీపావళి పండగతో పాటు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కూడా ఉండడంతో ఇప్పుడు మళ్ళీ మన్నత్ విద్యుత్ దీపాలతో జిగేల్ మనిపిస్తుంది. నవంబర్ 2న షారుఖ్ పుట్టినరోజు కావడంతో మన్నత్ విద్యుత్ దీపాలలో వెలుగులో కాంతులీనుతుంది. మరో రెండు రోజులలో దీపావళి కూడా ఉండడం.. ఆర్యన్ బెయిల్ మీద జైలు నుండి బయటకి రావడంతో పండగ సంబరాలు రెట్టింపు అయ్యాయి. అయితే.. షారుఖ్ పుట్టినరోజును నిరాడంబరంగా జరుపుకొనేందుకు సిద్దమయ్యాడట.

Samantha: గే క‌పుల్‌కు సామ్ శుభాకాంక్ష‌లు.. వైరల్‌గా మారిన పోస్ట్!

డ్రగ్స్ కేసులో ఆర్యన్ జైలు నుండి బయటపడినా.. కేసు ఇంకా తేలలేదు. పైగా ఆర్యన్ అదే మూడ్ లో ఉన్నాడని.. అందుకే ఈసారి తన పుట్టినరోజును కేవలం కుటుంబసభ్యులతోనే జరుపుకోవాలని షారుక్‌ ఖాన్‌ నిర్ణయించుకున్నారట. దీంతో సెలబ్రిటీలు ఎవరూ ఇప్పుడప్పుడే ఇంటికి రావొద్దని విజ్నప్తి చేస్తున్నాడు. కాగా, చాలా రోజుల తర్వాత మన్నత్ మళ్ళీ ఇలా వెలుగు జిలుగులు వీనుతుండడంతో బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.