Janhvi Kapoor: జాన్వీ, సారా ఆథ్యాత్మిక యాత్ర.. ఇంతలో అంత మార్పా?

బాలీవుడ్ స్టార్ డాటర్స్ జాన్వీ కపూర్, సారా అలీఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ ప్రపంచం.. అసలే అతిలోక సుందరి కూతురు కావడంతో జాన్వీ అదే స్థాయిలో అందాలను..

Janhvi Kapoor: జాన్వీ, సారా ఆథ్యాత్మిక యాత్ర.. ఇంతలో అంత మార్పా?

Janhvi Kapoor

Janhvi Kapoor: బాలీవుడ్ స్టార్ డాటర్స్ జాన్వీ కపూర్, సారా అలీఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ ప్రపంచం.. అసలే అతిలోక సుందరి కూతురు కావడంతో జాన్వీ అదే స్థాయిలో అందాలను రంగరించిన ఫోటో షూట్లను సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తుంటే.. నేనేమన్నా తక్కువా అని సారా కూడా గ్లామర్ ఒలికించేలా ఫ్యాషన్ దుస్తులతో ఫోటో షూట్లు పోస్ట్ చేస్తూ వచ్చేది. ఈ పోస్టులకు, ఫోటోలకు సోషల్ మీడియాలో ఫుల్ డిమాండ్ ఉండగా.. నెటిజన్ల వీటి గురించే చర్చించుకొనేవారు.

AHA 2.0: దీపావ‌ళి వెలుగుల‌ను మ‌రింత పెంచ‌నున్న ‘ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0’

కానీ, తాజాగా సారా అలీ ఖాన్‌, జాన్వీ క‌పూర్‌లు తమలోని ఆధ్యాత్మిక యాంగిల్ ను చూపించారు. కేదార్‌నాథ్‌ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించుకున్న ఈ ఇద్దరూ ట్రిప్ తాలూకు ఫొటోల‌ను త‌మ సోష‌ల్ ఖాతాల్లో షేర్ చేశారు. ఎప్పుడూ అల్ట్రా మోడరన్ గా చూసిన నెటిజ‌న్లకు ఇప్పుడు వీళ్ళని ఇలా చూడడంపై మిశ్ర‌మ రీతిలో స్పంద‌న ల‌భిస్తోంది. కొందరు వారిని అభినందిస్తే.. మరికొందరు సాధారణ దుస్తుల్లో.. ఎలాంటి మేకప్ లేకుండా ఇలా ఉంటారా అని విమర్శలు చేస్తున్నారు.

Puneeth-Pranitha: ప్రణీత ఉదారత.. పునీత్ నివాళిగా మెడికల్ క్యాంప్!

ఇక, ఈ మధ్యనే జాన్వీక‌పూర్, సారా అలీఖాన్ ఇద్ద‌రూ ఇటీవ‌ల ర‌ణ‌వీర్ సింగ్ క్విజ్ షో ది బిగ్ పిక్చ‌ర్‌ షోలో క‌నిపించి సంద‌డి చేయగా బెల్లి డాన్స్ తో రచ్చ చేశారు. సినిమాల విషయానికి వస్తే.. సారా అలీ ఖాన్ అత్రంగీ రే మూవీలో న‌టించ‌గా.. అందులో అక్ష‌య్‌, ధనుష్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. త్వ‌ర‌లో ఈ సినిమా విడుద‌ల కానుంది. జాన్వీ క‌పూర్ న‌టించిన రూహీ మూవీ విడుద‌ల కాగా.. త్వ‌ర‌లో గుడ్ ల‌క్ జెర్రీ, దోస్తానా 2 అనే మూవీలు విడుదలకి సిద్ధమవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)